ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆందోళన చేస్తున్న మందడం రైతులకు ముస్లింలు మద్దతు ప్రకటించారు. ఇవాళ మసీదులో ప్రార్థనలు ముగిసిన అనంతరం.. దీక్షా శిబిరానికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని.. న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్న రైతులకు అనుకూలంగా తీర్పులు రావాలని అల్లాను కోరారు. రాజధాని తరలింపు వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని ముస్లిం పెద్దలు అన్నారు.
మరోవైపు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అమరావతి ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పోరాటంపై వైకాపా నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: 'కొత్త రెవెన్యూ చట్టం తెస్తే మంచి కంటే చెడే ఎక్కువ'