ETV Bharat / city

నాటి వైభవం కోల్పోయి రోదిస్తోన్న మూసీ

ప్రాణాలతో పోరాడే మనిషిని బతికించుకునేందుకు.....చివరిక్షణాల దాకా ప్రయత్నాలు చేస్తాం. అది మానవత్వం... చనిపోయిన తర్వాత కూడా వస్తాడేమోనన్న ఆశతో...చివరకు చితి వద్ద కూడా పేరుపెట్టి పిలుస్తాం. ఓ మనిషి జీవితానికే ఇంత ప్రాధాన్యముంటే....తరతరాలకు బతుకునివ్వాల్సిన నది ఇంకెంత ప్రధానం...? భాగ్యనగరానికి వరప్రదాయినిగా ఉన్న మూసీనది ఇప్పుడు కాలుష్యం కాటుకు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. రక్షించండంటూ రోదిస్తోంది.

author img

By

Published : Dec 18, 2019, 5:42 PM IST

musi river contamination with house and industrial pollutants
నాటి వైభవం కోల్పోయి రోదిస్తోన్న మూసీ
నాటి వైభవం కోల్పోయి రోదిస్తోన్న మూసీ

చరిత్రలో అద్భుతమైన నాగరికతలు...విలాసమైన నగరాలు నదీ తీరాల్లోనే పుట్టుకొచ్చాయి. నాటి సింధూ నాగరికత నుంచి నేటి ఆధునిక నాగరికత వరకు....ఎన్నో చారిత్రక నిదర్శనాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. అంతటి గొప్ప విశిష్టత భాగ్యనగరానికీ ఉంది. నగరంలో ప్రవహించే మూసీ నది.....ఒకప్పుడు నగర ప్రజలకు జీవనవాహినిగా తులతూగింది. కానీ కొన్ని దశాబ్దాల్లోనే...పాలకుల అశ్రద్ధ, ముందుచూపు లేకుండా చేసిన మానవ తప్పిదాల కారణంగా నిర్జీవంగా మారింది. దేశంలోని ఐదు మృతనదుల్లో ఒకటిగా నిలిచింది.

దుఃఖదాయినిగా మారిన వరప్రదాయిని...

ఒకప్పుడు స్వచ్ఛమైన నీరు, అద్భుతమైన మత్స్యసంపద, పరివాహక ప్రాంతాల్లో ప్రకృతి అందాలతో తులతూగిన నది మూసీ. ప్రస్తుతం నాటి వైభవం కోల్పోయి మూగగా రోదిస్తోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేరే వ్యర్థాలతో....భయంకరమైన కాలుష్యాన్ని కడుపున మోస్తోంది. ఆ నీరు, నేల, పీల్చే గాలి..అన్నీ కలుషితమేనని తెలిసినా...ఆ మట్టితో అనుబంధం తెంచుకోలేకఎన్నో జీవితాలు అక్కడే కాల ప్రవాహంతో కలిసి సాగిపోతున్నాయి. ఒకప్పుడు భాగ్యనగర వరప్రదాయిని అయిన మూసీ నది...నేడు ఎందరికో దుఃఖదాయినిగా మారింది.

అభివృద్ధి పేరుతో చేసిన విధ్వంసమిది...

మూసీనదిలో ప్రవహించే నీరు, అటుగా వీచే గాలి, పరిసరాలు, పండే పంటలు, పచ్చటి మొక్కలు...పాతాళం నుంచి ఉబికి వచ్చే నీరు..ఇలా ప్రతిదీ కాలుష్య కాసారమే. అభివృద్ధి పేరుతో మనిషి చేసిన విధ్వంసం తాలూకు దుష్ఫలితాలకు ఇదో ప్రత్యక్ష నిదర్శనం.అంబర్‌పేట మొదలుకొని మూసారాంబాగ్‌ సహా...నగర శివారులోని పీర్జాదిగూడ, పర్వతాపూర్‌, కాచవాని సింగారం, ప్రతాప సింగారం, వెంకటాపూర్‌, ఎదుల్లాబాద్‌, కొర్రెముల, గౌరెల్లి, బాచారం, బండరావిరాల గ్రామాలలో ఈటీవీ భారత్​ పర్యటించింది.

అన్ని వ్యర్థాలు వదిలేది అందులోకే...

వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది...వికారాబాద్ పట్టణం, నవాబ్‌పేట, శంకర్‌పల్లి, మొయినాబాద్ మండలాల మీదుగా 44 కిలోమీటర్లు ప్రవహిస్తూ.... హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను తాకుతూ కృష్ణానదిలో కలుస్తుంది. నగరంలోకి ప్రవేశించిన ప్రాంతం నుంచి నల్గొండ పరిధిలోకి చేరే వరకు....57 కిలోమీటర్ల మేర మూసీ నది తీవ్రంగా కలుషితమైంది. ఇళ్ల నుంచి వ్యర్థ జలాలు, పరిశ్రమల నుంచి రసాయనిక వ్యర్థాలు సహా.... అన్నిరకాల వ్యర్థాలు 51 నాలాల ద్వారా మూసీలో కలుస్తున్నాయి.

సబర్మతీ తరహాలో అభివృద్ధి చేస్తాం.. ముఖ్యమంత్రి

భాగ్యనగరానికి మచ్చగా మారిన మూసీని సబర్మతీ నది తరహాలో అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ..ఆరంభశూరత్వంగా 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. 2017-18, 2018-19 బడ్జెట్‌లలో మూసీ నది ప్రక్షాళన కోసం మొత్తం 754.70 కోట్లు కేటాయించిన ప్రభుత్వం...ఈ రెండేళ్లలో 3 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అవి కూడా నిర్వాహణ కోసం ఖర్చుపెట్టేశామని తేల్చేసింది.

ప్రస్తుతం గ్రేటర్‌లో ప్రతిరోజు 1600 ఎంఎల్​డీల ముగురునీరు ఉత్పత్తి అవుతుంటే.... 771 ఎంఎల్​డీల మురుగునీటిని మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధి చేస్తున్నారు. నగరంలో ఉత్పత్తి అవుతున్న 90 శాతం మురుగు....నేరుగా మూసీలో కలుస్తోంది. మరో 10 శాతం వివిధ జలవనరుల్లో చేరుతోంది. దీంతో దిగువన చెరువులు, భూగర్భ జలాలు సైతం తీవ్రంగా కలుషితమైపోతున్నాయి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jersey City, New Jersey - 17 December 2019
1. Wide of funeral procession arriving at St. Aedan's Church
2. Wide of officers
3. Hearse filled with flowers arriving at church
4. Close of officers
5. Hearse arriving at St. Aedan's
6. SOUNDBITE (English) Glenn Gualtieri, Jersey City Police Department retired police officer:
"It's awful, I worked with Joe. I retired from that district in August after the 32 years, so I spent a lot of time working with Joe and it's not really something you can put in words when something like this happens. You could just grieve and pray for him and his family."
7. Hearse arriving
8. Cutaway of men waiting on hearse
9. Mid of officers and hearse
10. Close of people outside church in the rain
11. SOUNDBITE (English) Glenn Gualtieri, Jersey City Police Department retired police officer:
"Joe went to work every day, he loved doing what he did. And sometimes in different communities, you're not always the most popular person but there are a lot of people that are good people that have nowhere else to turn when it comes to crime and they look for the police to do whatever they can to keep things -- just to give them a little peace of mind. And Joe did that."
13. Various of coffin being taking inside church
14. SOUNDBITE (English) Officer Jon Goldin, Tacoma Park Police Department:
"You know, we come out and we support each other when these tragedies happen, and guys will come from other time zones, other states, and they'll do what they can to get here."
15. Crowd outside church
16. Ambulance outside church
17. Various of crowd outside, entering church
18. Traveling shot of armed policemen
19. SOUNDBITE (English) Lt. John Lamon, Sparta Police Department:
"We really feel for the family and we know that in our profession that something like this can happen, it's something you hope never would happen. But obviously these things do happen, and we're here just to show our support today."
20. Various of coffin being transferred to waiting hearse
21. Close of officer folding flag
22. Various of family
23. Wide of funeral procession
STORYLINE:
As rain poured down on Tuesday, thousands of police officers and mourners lined the streets of Jersey City to honor Jersey City Police Detective Joseph Seals, who was killed last week.
Seals, a 40-year-old married father of five, was killed in a confrontation a week ago with two attackers who then drove to a kosher market and killed three more people inside before dying in a lengthy shootout with police.
Outside St. Aedan's Church, retired Jersey City police officer Glenn Gualtieri remembered Seals as being "extremely conscientious, well-liked, a dedicated professional," adding that Seals' mild-mannered demeanor went against the stereotype many have of police officers.
Authorities haven't disclosed why Seals was in the location he was at the time he was killed, or what happened during the confrontation at a cemetery about a mile from the market.
Jersey City officials have said Seals led the department in removing illegal guns from the streets in recent years.
In 2008, he was credited with saving a woman from a sexual assault inside her own home on Christmas Eve.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.