ETV Bharat / city

రైల్లో పుట్టగొడుగులు.. మీరెప్పుడైనా చూశారా..! - ఉదయ్​ ఎక్స్​ప్రెస్​

Mushrooms in Train: పుట్టగొడుగులు పెంచాలంటే.. దానికో ప్రాసెస్​ ఉంటుంది. వాటిని సాగు చేసేవాళ్లు ఎంతో శ్రమకోర్చి పండిస్తుంటారు. కానీ అవేమీ లేకుండానే రైలు కోచ్​లలో పుట్టగొడుగులు పెరిగాయి. అదేంటి అదేలా సాధ్యం అనుకుంటున్నారా.. మీరే చూడండి..

రైల్లో పుట్టగొడుగులు.. మీరెప్పుడైనా చూశారా..!

author img

By

Published : Oct 11, 2022, 10:30 PM IST

Mushrooms in Train: అది విజయవాడ-విశాఖ మధ్య నడిచే ప్రతిష్ఠాత్మకమైన ఉదయ్​ ఎక్స్​ప్రెస్​ రైలు. పూర్తి ఏసీ కంపార్ట్‌మెంట్​లతో నడిచే రైలు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంతో కంపార్ట్​మెంట్​లో ఏకంగా పుట్ట గొడుగులు పెరిగాయి. సి-6 కోచ్​లోని వాష్​ బేసిన్​ దగ్గర ఈ పుట్ట గొడుగులు దర్శనమిచ్చాయి. తాజాగా తీసిన ఈ చిత్రాలు.. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక రైల్లో ఎక్కిన ప్రయాణికులంతా ఈ పుట్ట గొడుగులు చూసి ఆశ్చర్యపోతున్నారు.

రైల్లో పుట్టగొడుగులు
రైల్లో పుట్టగొడుగులు

రైల్వే సిబ్బంది రైళ్లలో పుట్ట గొడుగులు ఏమైనా పెంచుతున్నారా అనే సందేహం వెలిబుచ్చుతున్నారు. లోపలే ఇలా ఉంటే.. కోచ్​ బయట పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అధికారులు స్పందించి కోచ్​ నిర్వహణ, పరిశుభ్రతపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరముందని.. పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

పంటలను దెబ్బతీసిన వర్షాలు.. కొండెక్కిన కూరగాయల ధరలు

పక్షుల కోసం ప్రత్యేక ఆస్పత్రి.. అంతా ఉచితం.. ఎక్కడంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.