ETV Bharat / city

కాంగ్రెస్ అభ్యర్థిని ఎదుర్కోలేకనే తప్పుడు ప్రచారం: రేవంత్ - తెరాస, భాజపాపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

దుబ్బాకలో తెరాస, భాజపా నకిలీ వార్తల వ్యాప్తికి పాల్పడుతున్నాయని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఎదుర్కోలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలు ఆందోళనకు గురి కాకుండా అప్రమత్తంగా ఓటేయాలన్నారు.

mp revanth reddy fire on fake news spread in dubbaka
కాంగ్రెస్ అభ్యర్థిని ఎదుర్కోలేకనే తప్పుడు ప్రచారం: రేవంత్
author img

By

Published : Nov 3, 2020, 10:08 AM IST

Updated : Nov 3, 2020, 11:02 AM IST

దుబ్బాకలో కాంగ్రెస్​ను నేరుగా ఎదుర్కోలేక భాజపా, తెరాస వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఫేక్​న్యూస్​లు ప్రచారంలో పెట్టి ప్రజలలో గందరగోళాన్ని సృష్టించే కుట్రకు ఆ రెండు పార్టీలు సిద్ధపడ్డాయన్నారు.

నకిలీ న్యూస్ వ్యాప్తి వెనుక హరీశ్, రఘునందన్ రావు హస్తం ఉందని రేవంత్ అన్నారు. తప్పుడు వార్తల వ్యాప్తిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలు అనవసర గందరగోళాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: చిట్టాపూర్​లో సుజాత.. బొప్పాపూర్​లో రఘునందన్​రావు

Last Updated : Nov 3, 2020, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.