ఇంటికో ఉద్యోగమని చెప్పి కేసీఆర్, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పి మోదీ.. తెలంగాణ ప్రజలను మోసం చేశారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి గెలుపు ఖాయమని అన్నారు.
ఉద్యోగాల పేరిట తమను మోసం చేసిన కేసీఆర్, మోదీల పార్టీలను యువత తిరస్కరిస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ను ఓడించి, భాజపాను గెలిపించడానికే కేసీఆర్ పీవీ నర్సింహారావు కుమార్తెను పోటీలోకి దింపారని రేవంత్ మండిపడ్డారు. 2005 నుంచి మూడు సార్లు ఓడిపోయిన ఈ నియోజకవర్గంలో ఆమెను ఎలా బరిలోకి దింపారని నిలదీశారు. ఎవరేం చేసినా.. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : 'చిన్నారెడ్డిలో చిన్న మచ్చ కూడా లేదు.. గెలిపించండి'