RRR on president rule: ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో.. రాష్ట్రపతి పాలన విధించాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు లోక్ సభలో కోరారు. 377 నిబంధన కింద.. లోక్సభలో లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి నివేదించారు.
రుణాలు పొందడానికి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని సభ దృష్టికి తీసుకువెళ్లారు. జీతాలు చెల్లించడానికి కూడా డబ్బులు లేక కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారిన ప్రభుత్వం రుణాలు తీసుకుందని అన్నారు. రాష్ట్రం ఒక రకంగా ఆర్థిక దివాళా పరిస్థితికి చేరుతోందని, ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని రఘురామ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
Chandrababu on ABN Radhakrishan: 'మీ తప్పులకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు'