లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మరోలేఖ రాశారు. తనపై అనర్హత వేటు కోసం పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. లక్ష లేఖలు ముద్రించి లేఖలు పంపేలా ప్రణాళికలు వేశారని అన్నారు. ముందనుకున్న మొబైల్ నంబర్లు, ఆధార్ నంబర్లు రాసేలా ప్రణాళికలు రూపొందించారని... విషయం బయటకు పొక్కడంతో ఆ ప్రణాళిక ఆపేశారని పేర్కొన్నారు.
కుట్రలు, ప్రణాళికల ద్వారా ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారన్నారు. తనపై అనర్హత వేటు కోసం అనేక పక్కదారులు పడుతున్నారని లేఖలో వివరించారు.
ఇదీ చదవండి: UTTAM KUMARREDDY: పీవీ సేవలు చిరస్మరణీయం: ఉత్తమ్ కుమార్‌రెడ్డి