125 Food Items prepare For Son In Law: కాబోయే అల్లుడికి 125రకాల వంటకాలుతో ఘనంగా విందు ఏర్పాటు చేశారు ఏపీలోని విశాఖకు చెందిన ఓ కుటుంబం. విజయనగరంలోని శృంగవరపుకోటకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాపుగంటి చైతన్యకు విశాఖకు చెందిన నిహారికతో వివాహం నిశ్చయం అయింది. వచ్చే ఏడాది వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు.
నిశ్చితార్థం అయ్యాక తొలి పండుగ కావడంతో అల్లుడిని దసరా పండుగకు ఆహ్వానించారు. భోజనం దగ్గరకు వెళ్లేసరికి పెట్టిన వంటకాలు చూసిన అల్లుడు ఆశ్చర్యపోయాడు. ఈ ఏర్పాట్లను చూసి చైతన్య ఆనందపడ్డాడు. ఈ భారీ విందు ఊహించలేదని తెలిపాడు. వంటకాలన్నీ అరగించలేక అయాసపడినట్లు అతను వివరించాడు.
ఇవీ చదవండి: