ETV Bharat / city

Covid Fear : కరోనా భయం.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న జనం - corona cases in telangana

కొవిడ్ భయంతో అనేక మంది వ్యాధులకు గురైనా ఆస్పత్రి వైపు చూడటం లేదు. చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే ఎక్కడ కరోనా అంటుకుంటుందోన్న భయంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కారణమేదైనా సాధారణ వైద్యాన్ని వాయిదా వేస్తే ఆరోగ్యం గాడి తప్పుతుందని వైద్యులు హెచ్చరించినా.. ప్రజలు భయం వీడటం లేదు. ఆస్పత్రులకు రావడం లేదు.

hospital, covid fear, covid fear in hospital
కరోనా భయం, ఆస్పత్రుల్లో కరోనా భయం
author img

By

Published : Jun 7, 2021, 9:38 AM IST

కరోనా భయంతో అనేకమంది రోగులు వివిధ రకాల వైద్య చికిత్సలను వాయిదా వేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మహా నగరంలో దాదాపుగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ కొవిడ్‌ రోగుల చికిత్సలో తలమునకలయ్యాయి. ఉస్మానియా, నిమ్స్‌ ఆస్పత్రుల్లోనే సాధారణ రోగులకు వైద్యం అందుతోంది. మామూలు రోజుల్లో ఈ రెండు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడాలి. నిత్యం వేలాది మంది వచ్చి వైద్యులకు చూపించుకుని అవసరమైన వారు ఆస్పత్రుల్లో చేరేవారు. నిమ్స్‌కు ప్రస్తుతం 500 మందికి మించి రోగులు రావడం లేదు. ఉస్మానియాకూ తాకిడి తక్కువగానే ఉంది. కరోనా నేపథ్యంలో ఆస్పత్రిలో చేరితే వైరస్‌ అంటుకుంటుందనే భయంతో ఎవరూ రావడం లేదు. ఈక్రమంలో అత్యవసరంగా చేయాల్సిన ఆపరేషన్లు కూడా వాయిదా పడటంతో అనేక మంది ఆరోగ్యం గాడి తప్పుతోంది.

ప్రధాన ఆస్పత్రుల్లో ఇలా..

ప్రభుత్వ ఆసుపత్రులైన గాంధీ, టిమ్స్‌.. కరోనా వైద్యంలో కీలక భూమికను పోషిస్తున్నాయి. రెండోదశ కరోనాకు ముందు 1,850 పడకలతో ఉన్న గాంధీకి నిత్యం 2,500 మంది రోగులు వచ్చి డాక్టర్లకు చూపించుకునేవారు. 1000 పడకలతో ఉన్న టిమ్స్‌కూ ప్రతిరోజూ వెయ్యిమంది రోగులు వచ్చేవారు. ఇప్పుడు ఈ రెండు ఆస్పత్రులు పూర్తి స్థాయిలో కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నాయి. ఛాతీ, కింగ్‌కోఠి, ఫీవర్‌, కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రులూ కొవిడ్‌ చికిత్సల్లో నిమగ్నమై ఉన్నాయి. ఉస్మానియా ఆస్పత్రి మాత్రమే కరోనాయేతర వైద్యం అందిస్తోంది. రెండో దశ విస్తరించముందు నిత్యం 2500-3000 వేల మంది ఇన్‌ పేషెంట్లు వచ్చేవారు. ప్రస్తుతం వెయ్యికి మించి రావడం లేదు. ఈ ఆస్పత్రిలో 1500 పడకలుండా కొన్ని విభాగాల్లో 30 శాతం ఖాళీగానే ఉంటున్నాయి. నిమ్స్‌లో పరిస్థితి మరీ దారుణం. వైరస్‌ వ్యాప్తి చెందకముందు వివిధ జిల్లాల నుంచి, ఏపీ నుంచి రోగులు వెరసి 3 వేల మంది వరకు వచ్చేవారు. 1500 పడకలతో ఉన్న ఈ ఆస్పత్రిలో వెంటనే పడక దొరికేది కాదు. కరోనా రోగుల కోసం 200 కేటాయించారు. సాధారణ రోగులు లేక చాలా వార్డులు ఖాళీగా ఉన్నాయి. ఆర్థో, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాల్లో 40 శాతం పడకలు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి.

ఉస్మానియా ఆస్పత్రి

ప్రాణాలు పోతున్నాయి..

  • క్యాన్సర్‌ లక్షణాలు కన్పించిన వెంటనే రోగులు పరీక్షలు చేయించుకుని కీమో, రేడియేషన్‌ చికిత్స మొదలుపెడితే వెంటనే కోలుకోవచ్ఛు చాలామందికి ఈ లక్షణాలు బయటపడినా కరోనా తీవ్రత తగ్గిన తరువాతే ఆస్పత్రికి వెళదామని ఆగిపోతున్నారు. దీంతో వ్యాధి ముదిరిపోతోంది.
  • కరోనా బారినపడిన రోగుల్లో చికిత్స తరువాత వారి రక్తంలో డీడైమర్‌ స్థాయి పెరిగిపోతోంది. స్థిరాయిడ్లు వాడటంతో కొందరిలో మధుమేహం అమాంతం పెరుగుతోంది. వీరు ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించి అవసరమైతే ఆస్పత్రిలో చేరాలి. వీరూ ఆస్పత్రులకు రావడం లేదు.
  • గుండె సంబంధ వ్యాధులతో బాధపడేవారు కచ్చితంగా 2 నెలలకోసారి వైద్యులకు చూపించుకోవాలి.ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారూ ప్రతినెలా వైద్యులకు చూపించుకోవడానికి రాకపోవడంతో వారిలో వ్యాధి లక్షణాలు తీవ్రమై ఆరోగ్యం విషమిస్తోంది. చివరి నిమిషంలో ఆస్పత్రులకు పరుగులు తీస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
నిమ్స్ ఆస్పత్రి

సాధారణ వైద్యం వాయిదా సరికాదు

కరోనా రెండో దశ వచ్చిన తరువాత మా ఆస్పత్రికి రోజువారీ వచ్చే రోగుల సంఖ్య తగ్గిన మాట వాస్తవమే. కారణమేదైనా.. సాధారణ వైద్యాన్ని వాయిదా వేసుకోవడం మంచిది కాదు. అత్యవసర వైద్యానికి వచ్చే రోగుల సంఖ్య మాత్రం తగ్గలేదు.

- డాక్టర్‌ బి.నాగేందర్‌, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌

గాంధీ ఆస్పత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.