ETV Bharat / city

బల్దియా ఎన్నికల్లో పది ఓట్లు కూడా దక్కని అభ్యర్థులెందరో! - జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాలు 2020

0, 1, 2, 3, 4, 5, 6.. ఇవి అంకెలు మాత్రమే కాదు.. గ్రేటర్‌ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులకు వచ్చిన ఓట్లు. చిన్న పార్టీలు, అనేకమంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.

single digit votes in ghmc elections 2020
పది ఓట్లు కూడా దక్కని అభ్యర్థులు
author img

By

Published : Dec 6, 2020, 10:04 AM IST

జంగంమెట్‌ డివిజన్‌లోని ఓ స్వతంత్ర అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా..? సున్నా! తన ఓటు కూడా తాను వేసుకోలేదన్నమాట.

ఈసారి 150 డివిజన్లకు అన్ని పార్టీలు, స్వతంత్రులు కలిపి 1122 మంది పోటీ చేశారు. వీరిలో 70 మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.

ఇదీ పరిస్థితి..

  • జంగంమెట్‌ డివిజన్‌లో అత్యధికంగా 20 మంది పోటీ చేశారు. పెద్ద బ్యాలెట్‌ అవసరం పడింది. 13 మంది స్వతంత్రులే. ఆరుగురు పది లోపే ఓట్లు సాధించారు. రజనీకాంత్‌ అనే అభ్యర్థికి ఒక్క ఓటూ పోలవ్వలేదు. మరో అభ్యర్థి వెంకటేశ్‌కు మూడే వచ్చాయి.
  • మైలార్‌దేవ్‌పల్లి నుంచి బీఎంపీ తరఫున పోటీ చేసిన గిరిబాబుయాదవ్‌కు ఒక్క ఓటే వచ్చింది. తన ఓటు మాత్రమే తనకు పడిందన్నమాట. మెహిదీపట్నం బీఎంపీ అభ్యర్థి నజీర్‌అహ్మద్‌కు 8 ఓట్లే దక్కాయి.
  • మన్సూరాబాద్‌ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి వెంకటేశ్వర్‌రెడ్డి, సరూర్‌నగర్‌లో పోటీ చేసిన దీపికయాదవ్‌కు రెండు ఓట్ల చొప్పున వచ్చాయి.
  • హెచ్‌బీకాలనీలో పృథ్వికుమార్‌కు 4, సరూర్‌నగర్‌ స్వతంత్ర అభ్యర్థి సాయికి ఆరు ఓట్ల చొప్పున పోలయ్యాయి.
  • కుర్మగూడ స్వతంత్ర అభ్యర్థికి 3, పురానాపూల్‌లో టీజేఎస్‌పీ అభ్యర్థి అనిల్‌సేన్‌కు ఆరు ఓట్లు దక్కాయి.
  • బంజారాహిల్స్‌లో ఐదుగురికి సింగిల్‌ డిజిట్‌ ఓట్లే వచ్చాయి.
  • కేపీహెబ్‌బీలో 11మంది పోటీచేస్తే ముగ్గురికి 5 మించి ఓట్లు రాలేదు.

ఇదీ చూడండి : కార్పొరేటర్లలో 25 మందికి నేర చరిత్ర..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.