ETV Bharat / city

MONKEYPOX: విజయవాడలో ‘మంకీ పాక్స్‌’ కలకలం - latest news in ap

MONKEYPOX: ఏపీలోని విజయవాడలో మంకీ పాక్స్‌ కలకలం రేగింది. ఓ చిన్నారికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీ పాక్స్‌ కేసుగా వైద్యులు భావిస్తున్నారు.

MONKEYPOX: విజయవాడలో ‘మంకీ పాక్స్‌’ కలకలం

author img

By

Published : Jul 17, 2022, 2:17 PM IST

MONKEYPOX: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్‌.. భారత్‌కూ విస్తరించి.. తొలికేసు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలోని విజయవాడలోనూ మంకీ పాక్స్‌ కేసు కలకలం రేపింది. దుబాయి​ నుంచి వచ్చిన కుటుంబంలో ఓ చిన్నారి శరీరంపై దద్దుర్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దద్దుర్లు రావడంతో మంకీ పాక్స్‌ కేసుగా అనుమానం వ్యక్తం చేశారు. చిన్నారి నమూనాలను సేకరించిన అధికారులు.. పుణె ల్యాబ్‌కు పంపించారు. అనంతరం చిన్నారి కుటుంబాన్ని ఐసోలేషన్​కు తరలించారు. ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం.

మంకీపాక్స్ గురించి: మంకీపాక్స్ ఒక వైరల్‌ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్‌ కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్‌ అధికంగా వ్యాపిస్తుంటుంది. ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం, శారీరకంగా కలవడం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముంది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్‌ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమనని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

ఇవే లక్షణాలు..

జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్మాల్‌పాక్స్‌ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయి. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. కేవలం 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

వారిలోనే ఎక్కువ..! ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా వేగంగా విస్తరిస్తోన్న మంకీపాక్స్‌ ఇప్పటికే 59 దేశాలకు పాకింది. 6వేల మందిలో నిర్ధారణ కాగా.. ముగ్గురు మృత్యువాతపడ్డారు. మంకీపాక్స్‌ కేసులు ఎక్కువగా యూరప్‌, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, ముఖ్యంగా స్వలింగ సంపర్కుల్లోనే ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవీ చదవండి:

వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల తక్షణ సాయం: సీఎం కేసీఆర్​

బాలికపై అత్యాచారం.. నోట్లో యాసిడ్ పోసి మరీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.