ETV Bharat / city

నర్సును మోసం చేసిన కేటుగాళ్లు.. లాడ్జికి పిలిపించి అసభ్య ప్రవర్తన - Criminals cheat Money to nurse

ఎక్కువ వడ్డీ ఇస్తామని ఎవరైనా ఆశజూపినా... లేదా తక్కువ కాలంలోనే రెట్టింపు డబ్బు చెల్లిస్తామని చెప్పినా... గుడ్డిగా నమ్మేసి కష్టార్జితాన్ని సమర్పించేసుకోవద్దు. తీరా డబ్బు వాళ్ల చేతిలో పెట్టాక... రెట్టింపు డబ్బు కాదు కదా ఇచ్చిన డబ్బు కూడా వెనక్కి రాదు. గతంలో ఇలాంటి ఉదంతాలు చాలానే వెలుగుచూశాయి. అయినప్పటికీ ఏదో విధంగా అమాయకులను బుట్టలో వేసుకునే కేటుగాళ్లు ఎక్కువైపోయారు. తాజాగా హైదరాబాద్‌కి చెందిన ఓ నర్సు కూడా ఇలాగే ఇద్దరు కేటుగాళ్ల చేతిలో మోసపోయింది.

Money Cheet on women in Shamshabad
నర్సును మోసం చేసిన కేటుగాళ్లు.. లాడ్జికి పిలిపించి అసభ్య ప్రవర్తన
author img

By

Published : Sep 2, 2020, 5:50 PM IST

డబ్బు తీసుకొని ఇద్దరు వ్యక్తులు తనను మోసం చేశారని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో రంగమ్మ అనే నర్సు ఫిర్యాదు చేశారు. గతేడాది రాజేశ్‌ అనే వ్యక్తి రూ.55 లక్షలు, సింహాచలం అనే వ్యక్తి రూ.15 లక్షలు తీసుకున్నారని, నెలరోజుల్లో రెట్టింపు డబ్బు ఇస్తామని నమ్మించారని బాధితురాలు చెబుతున్నారు.

జామీనుగా ప్లాట్లు రాసిస్తామన్నారని, డబ్బు విషయమై శంషాబాద్‌ లాడ్జికి పిలిపించి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కత్తితో బెదిరించడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించారని రంగమ్మ ఆరుగురిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి: రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల సరఫరా చేయండి: కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.