ETV Bharat / city

టికెట్‌ ఎవరికి వచ్చినా పనిచేస్తానన్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి - ఎమ్మెల్సీ మహెందర్​రెడ్డి తాజా వార్తలు

Mlc Mahender Reddy రాష్ట్రంలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో తాండూరు నుంచి తెరాస టికెట్ ఎవరికి వచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తానని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు. అధిష్ఠానం తాండూరు రాజకీయాలపై తనకు కొన్ని విషయాల గురించి స్పష్టత ఇచ్చిందని అవి మా మధ్యనే ఉంటాయన్నారు. ఈ నెల 16న జరిగే సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు జిల్లానుంచి లక్ష మందిని సమీకరిస్తున్నట్లు తెలిపారు.

Mahender Reddy
Mahender Reddy
author img

By

Published : Aug 15, 2022, 8:37 AM IST

Mlc Mahender Reddy: 2023లో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో తాండూరు నుంచి తెరాస టికెట్‌ ఎవరికి వచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తానని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తెలిపారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులోని తన స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టికెట్‌ మాత్రం తనకే వస్తుందని గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పారు. అధిష్ఠానం తాండూరు రాజకీయాలపై తనకు కొన్ని విషయాల గురించి స్పష్టత ఇచ్చిందని అవి మా మధ్యనే ఉంటాయన్నారు.

నేనేం చేయలేను.. తాండూరు, వికారాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లను మార్చే విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, స్థానికంగా మీరే మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని అధిష్ఠానం సూచించిందని వివరించారు. ఛైర్‌పర్సన్లను రాజీనామా చేయాలని సూచిస్తే ససేమిరా అంటున్నారు. కాబట్టి నేనేమీ చేయలేను. మున్సిపాలిటీ పాలనా వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జోక్యం ఉండదు. పాలక వర్గాలు ఆహ్వానిస్తే మాత్రమే వెళ్లాలనే నిబంధన ఉందని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో ఛైర్మన్ల నిర్ణయమే అంతిమంగా ఉంటుందన్నారు. జిల్లాలో రాజకీయంగా ఏం జరుగుతోందో తనకు బాగా తెలుసని అన్నారు. ఈ నెల 16న జరిగే సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు జిల్లానుంచి లక్ష మందిని సమీకరిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.