ETV Bharat / city

'ఆ మెసేజ్‌లు సేవ్ చేసి.. మీ లైఫ్‌ను సేవ్ చేస్కోండి'

Kavitha About Online Harassment : సామాజిక మాధ్యమాల్లో మహిళలు వేధింపులకు గురైతే భయపడి వెనకడుగేయొద్దని.. ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మహిళలకు వచ్చిన అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు, ఇతర లింక్స్‌ను స్క్రీన్‌షాట్ తీసుకుని.. ఫిర్యాదు చేసేటప్పుడు పోలీసులకు అందించాలని చెప్పారు. మేసెజ్‌లు డిలీట్ చేయడం.. కాంటాక్స్ట్స్ బ్లాక్ చేయడం కాకుండా టెక్నాలజీని వినియోగించుకుని సాంకేతిక ఆధారాలతో ఫిర్యాదు చేస్తే... వీలైనంత త్వరగా చర్యలు చేపట్టే వీలుంటుందని తెలిపారు. ట్రూ కాలర్ ఆధ్వర్యంలో మహిళల వేధింపులపై గళమెత్తుదాం అనే అంశంపై చేపట్టిన జాతీయ వ్యాప్త ప్రజా అవగాహన సదస్సులో కవిత పాల్గొన్నారు.

Kavitha About Online Harassment
Kavitha About Online Harassment
author img

By

Published : May 16, 2022, 6:25 PM IST

Kavitha About Online Harassment: వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్.. మాధ్యమమేదైనా ఆడపిల్ల అడుగుపెట్టిందనే వేధింపులు అడుగడుగునా వస్తుంటాయని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కానీ.. ఆడవారు అధైర్యపడకుండా స్వేచ్ఛగా సోషల్ మీడియాను వినియోగించుకోవాలని చెప్పారు. ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు గురిచేస్తే భయపడకుండా వెంటనే వారిపై అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ట్రూ కాలర్ ఆధ్వర్యంలో మహిళల వేధింపులపై గళమెత్తుదాం అనే అంశంపై చేపట్టిన జాతీయ వ్యాప్త ప్రజా అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : చైన్ స్నాచర్లకు బుద్ధి చెప్పిన కాజల్.. గన్​తో కూతుర్ని బెదిరించగానే..

Kavitha About Social Media Harassment: సోషల్ మీడియాలో తమ అకౌంట్లకు అనవసరపు సందేశాలు, అసభ్యకర మెసేజ్‌లు వంటివి వస్తే వారిని బ్లాక్ చేయడం, మెసేజ్‌లు డిలీట్ చేయడం కాకుండా వాటిని సేవ్ చేసుకోవాలని.. భవిష్యత్‌లో తమను ఇబ్బంది పెడుతున్న వారిపై ఫిర్యాదు చేయాలన్నా.. వారి నుంచి తమను కాపాడుకోవాలన్నా ఈ సేవ్ చేసిన స్క్రీన్‌షాట్స్‌ను పోలీసులకు చూపించి ఫిర్యాదు చేయాలని మహిళలకు ఎమ్మెల్సీ కవిత సూచించారు. మహిళలు మౌనంగా ఉన్నంత వరకు ఆకతాయిల ఆగడాలు పెరుగుతూనే ఉంటాయని.. ఒక్కసారి గొంతు విప్పితే.. ఒక్క అబ్బాయి కూడా తమ జోలికి వచ్చే ధైర్యం చేయడని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళల వేధింపులపై గళమెత్తడం అనే అంశంపై మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.. టెక్నాలజీ-వేధింపులు అనేవి కవలపిల్లలాంటివని అన్నారు. సాంకేతికతతో ఎంత లాభం ఉంటుందో దానికి రెట్టింపు నష్టాలుంటాయని చెప్పారు.

Kavitha at Callitout#ItsnotOK : సోషల్ మీడియాలో మహిళలు చాలా వేధింపులు ఎదుర్కొంటున్నారని.. కొన్ని చోట్ల తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని కవిత అన్నారు. కానీ తెలంగాణలో పరిస్థితి మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో మహిళల సాధికారతకు.. స్వావలంబనకు.. రక్షణకు కేసీఆర్ సర్కార్ ఎనలేని కృషి చేస్తోందని తెలిపారు. కేవలం విద్యావంతులు, ఉద్యోగినులకే కాదు.. చదువుకోని మహిళలకు.. గ్రామీణ పడతుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వెల్లడించారు.

"తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో ఆడపిల్లలంతా సురక్షితంగా ఉన్నారు. రాష్ట్రంలో సంక్షేమపథకాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. మా రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఆర్థిక పెత్తనం మహిళలదే. ప్రతి ఇంటికి సీఎఫ్‌ఓ ఆ ఇంటి మహిళే. ఆడపిల్లలను ఆటపట్టించే ఆకతాయిల ఆగడాలకు క్షణాల్లో అడ్డుకట్టవేస్తున్నాం. మా పోలీసులు ఆకతాయిల ఆటకట్టించడంలో అర సెకను కూడా ఆలస్యం చేయరు. షీ టీమ్స్‌, సైబర్‌ సెల్‌ వంటి కార్యక్రమాలతో తెలంగాణ ఆడపడుచులకు అనుక్షణం రక్షణ కల్పిస్తున్నాం. సాధికారతలోనూ తెలంగాణ అమ్మాయిలు నంబర్‌ వన్‌. మా రాష్ట్రంలో మగాళ్లకు దీటుగా కరెంట్‌ పోల్‌ ఎక్కి విద్యుత్ తీగలు సరిచేసే లైన్ ఉమెన్‌ ఉన్నారు. భూగర్భంలోకి వెళ్లి బొగ్గును తవ్వే మైనింగ్ ఇంజినీర్లు ఉన్నారు." - కల్వకుంట్ల కవిత, తెరాస ఎమ్మెల్సీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.