ETV Bharat / city

కేంద్రం విడుదల చేసిన ఆ నివేదికలో తెలంగాణ పేరే లేదు: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Tweet on NDRF Funds: హైదరాబాద్​కు వరద సాయం అందించడంలో భాజపా ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. 2021-22 సంవత్సరంలో వివిధ రాష్ట్రాలకు కేటాయించిన జాతీయ విపత్తుల ఉపశమన నిధుల వివరాలను ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

MLC Kavitha Tweet
MLC Kavitha Tweet
author img

By

Published : Apr 7, 2022, 4:26 PM IST

MLC Kavitha Tweet on NDRF Funds: ఎన్డీఆర్ఎఫ్ నిధుల నుంచి రాష్ట్రానికి కేంద్రం ఒక్కపైసా విడుదల చేయలేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. 2021-22 సంవత్సరంలో వివిధ రాష్ట్రాలకు కేటాయించిన జాతీయ విపత్తుల ఉపశమన నిధుల వివరాలను ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. కేంద్రం విడుదల చేసిన నివేదికలో తెలంగాణ పేరే లేదని కవిత ప్రస్తావించారు. వరదలతో అల్లాడిపోయిన రాష్ట్రానికి 1,350 కోట్ల రూపాయల తక్షణ సాయంతో కలిపి 5 వేల కోట్ల రూపాయల ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధులివ్వాలని సీఎం కేసీఆర్‌ గతంలోనే ప్రధానమంత్రికి లేఖ రాశారని గుర్తు చేశారు.

భారీ వర్షాలు, వరదలతో 2020లో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్​కు సీఎం కేసీఆర్ అన్ని విధాలా అండగా ఉండగా.. కేంద్రం ఏ మాత్రం ఆదుకోలేదని విమర్శించారు. వరద బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకుందని గుర్తుచేశారు. ప్రతీ అంశంలో తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షపూరిత వైఖరి మనసును కలచి వేస్తోందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.

  • In the year 2020, Hyderabad witnessed one of the worst natural calamity - a series of floods. The State Govt under CM Sri KCR stood like a wall for the people and our only hope was support from the centre 1/2 pic.twitter.com/wnT9F5u2TU

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) April 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:ఒక మహిళను గౌరవించే విధానం ఇదేనా..? : గవర్నర్ తమిళిసై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.