ETV Bharat / city

ఎమ్మెల్యే శ్రీధర్​బాబుకు కీలక పదవి అప్పగించిన కాంగ్రెస్​ హైకమాండ్ - ఏఐసీసీ కార్యదర్శిగా శ్రీధర్​బాబు

Sridhar Babu: మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కర్ణాటకకు ఇంఛార్జీ కార్యదర్శిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

Sridhar Babu
Sridhar Babu
author img

By

Published : Jul 10, 2022, 9:37 AM IST

Sridhar Babu: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక పదవి లభించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా.. కర్ణాటక రాష్ట్ర ఇన్​ఛార్జిగా మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును పార్టీ హైకమాండ్‌ నియమించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ నియమాకం చేసింది. శ్రీధర్‌ బాబును అభినందిస్తూ.. పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్​ఛార్జి మానిక్కం ఠాగూర్, ఏఐసీసీ ఇన్​ఛార్జి కార్యదర్శి బోసురాజు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి, కోశాధికారి సుదర్శన్​రెడ్డి, తదితర కాంగ్రెస్‌ నేతలు సన్మానించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.