MLA Rajgopal Reddy gets emotional : హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను సాధించింది కాంగ్రెస్ నేతలేనని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చేలా సోనియా గాంధీని ఒప్పించింది కూడా తామేనని గుర్తు చేశారు. అధికార పార్టీ నేతలు తరచూ తమ నాయకులన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు.
MLA Rajgopal Reddy gets emotional in Assembly : భారీ ప్రాజెక్టుల పేరుతో మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయొచ్చు కానీ.. అనవసరంగా అప్పులు చేయడం సమంజసం కాదన్నారు. తెలంగాణయే.. వేరే రాష్ట్రాలకు అప్పులిచ్చే స్థితిలో ఉండాలనేది తన ఆకాంక్ష అని తెలిపారు. పవర్ ప్లాంట్ల మీద లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
ఎనిమిదేళ్ల తర్వాత కేసీఆర్‌కు వైద్యరంగం గుర్తుకొచ్చిందా అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. ఎనిమిదేళ్ల తర్వాత మన ఊరు- మన బడి కార్యక్రమం తీసుకొచ్చారని.. ఇన్నేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు.
MLA Rajgopal Reddy in Assembly 2022 : "మంత్రి స్థానంలో ఉండి మమ్మల్ని అవమానించారు. నాకు తెలుసు హరీశ్ రావు.. యక్తవయస్సు నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన బాగా మాట్లాడతారు. ఎంత బాగా మాట్లాడతారంటే.. ఆయన మాట్లాడిన ప్రతిమాట నిజమే అనిపించేలా మాయ చేస్తారు. నేను ఒప్పుకుంటాను ఆయన చాలా తెలివిమంతుడు. కానీ కాంగ్రెస్ నేతలను తెలివిలేని వారని అవమానించడం ఎంత వరకు సమంజసం. మమ్మల్ని ప్రతిచోటా అవమానిస్తున్నారు. తలుచుకుంటే గుండె తరుక్కుపోతోంది. తెలంగాణ సాధించడంలో మా పాత్ర కీలకం. అలాంటి మమ్మల్ని కించపరిచేలా మాట్లాడుతుంటే బాధ కలుగుతోంది."
- రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్