భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వర్ధంతి సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నివాళులర్పించారు. తన నియోజకవర్గంలో భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాజాసింగ్.. వారి ప్రాణత్యాగం వల్లే భరతభూమికి స్వతంత్య్రం వచ్చిందని కొనియాడారు.
భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వంటి మహనీయులను ఎన్నటికీ మరవరాదు అని రాజాసింగ్ అన్నారు. వీరి త్యాగాలు ప్రతి తరానికీ ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.
- ఇదీ చదవండి : అసెంబ్లీ ముట్టడికి గంగపుత్ర సంఘం యత్నం