ETV Bharat / city

తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అన్నావు కదా.. ఏమైంది? - తెలంగాణ వరి కొనుగోలు సమస్య

Etela Rajender Fires on KCR: రైతులను సీఎం కేసీఆర్‌ అయోమయానికి గురిచేస్తున్నారని ఈటల రాజేందర్​ మండిపడ్డారు. పొంతన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సాగు, కొనుగోళ్లపై పౌరసరఫరాల మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

etela rajendhar
etela rajendhar
author img

By

Published : Mar 23, 2022, 5:24 PM IST

Etela Rajender Fires on KCR: తెలంగాణ వ్యవసాయం రంగం దేశంలోనే అత్యంత గందరగోళ పరిస్థితిలో ఉందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. భాజపా మీద కోపాన్ని కేసీఆర్ రైతుల మీద చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణ కొత్తగా వచ్చింది కాదని... దశాబ్దాలుగా కొనసాగుతోందని ఈటల అన్నారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాక పంట పెరిగిందని చెప్పారు. ఫుడ్ కార్పొరేషన్ రెండు విధానాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం డీసీపీ పద్ధతిని ఎంచుకుని ధాన్యాన్ని ఇస్తుందని ఈటల తెలిపారు. వడ్లు, గన్ని సంచులు, సూతిల్ దారాలకు, హామీల కోసం కేంద్రం డబ్బులు చెల్లిస్తుందని... రాష్ట్ర ప్రభుత్వం వరి సేకరణలో ఒక ఏజెన్సీల పని చేస్తుందని వివరించారు. ముందు చూపు లేక చిన్న చూపు చూడటం వల్లే సమస్య ఉత్పన్నం అవుతుందని చెప్పారు.

'కేంద్ర ప్రభుత్వం చేస్తోందనే ఫీజు రీయవంబర్స్​మెంట్, దళిత బంధు, ఫించన్లు ఇస్తున్నారా? వడ్ల కొనుగోలు, రైతులకు ఇచ్చే ప్రతి సొమ్ము ప్రజల పన్నుల ద్వారా వచ్చినవే. వడ్లు పండించి పార్టీ కార్యాలయం, ఇళ్ల ముందు పోస్తామని కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. పార్టీ ఆఫీసుల మీద దాడులు, ధర్నాలు చేస్తారా? ' - ఈటల రాజేందర్​

వరి వేయవద్దంటే.. రైతుల పరిస్థితి ఏమి కావాలని ఈటల ప్రశ్నించారు. కోటి ఎకరాల్లో పంట పండిస్తే ఎక్కడ అమ్ముకుంటారని కేసీఆర్​ను నిలదీశారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అన్నావు కదా ఏమైందని అడిగారు. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఎక్కడా చెప్పలేదని ఈటల స్పష్టం చేశారు. ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. భాజపా అధికారంలోకి వచ్చాక ప్రతి పంటను కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు.

రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం తెలంగాణ భాజపా కృషి చేస్తోందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లు బిల్లు పంపిన మాట వాస్తవమని తెలిపారు. కేంద్ర మంత్రి తమకు చేరలేదని అంటున్నారని... దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : 'పండిన ధాన్యం అంతా కొనలేం.. దానికి కొన్ని లెక్కలుంటాయి..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.