MLA Balineni Srinivas: తాను జనసేన పార్టీలోకి వెళుతున్నట్టు కొంత మంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే.. పార్టీ కేడర్ మధ్య కొంత సమన్వయ లోపం ఉందని.. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకే సమన్వయ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.
దీన్ని వక్రీకరించి.. తాను జనసేనలోకి వెళ్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. చేనేత వస్త్రాల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విసిరిన చాలెంజ్ ను స్వీకరించి.. చేనేత వస్త్రాలు ధరించానన్నారు. గతంలో రాజశేఖరరెడ్డి హయాంలోగానీ.. ఇప్పుడు జగన్ రెడ్డి హయంలోగానీ.. చేనేతకు తాము ఎంతో చేశామని, అందుకే పవన్ ట్వీట్‌కు సమాధానం ఇచ్చానని చెప్పారు. దీనికి తప్పుడు అర్థాలు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఛాలెంజ్‌ను పవన్ స్వీకరించారని.. అంతమాత్రాన పవన్ పార్టీ మారతారని అనుకోవాలా..? అని బాలినేని ప్రశ్నించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖరరెడ్డి అని.. తాను ఎప్పుడూ వైఎస్‌ఆర్ పార్టీలోనే ఉంటానని.. జగన్ వెంట నడుస్తానని తేల్పిచెప్పారు. తాను ఊసరవెల్లి రాజకీయాలు చేయబోనని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: