ఏపీ సీఐడీ (AP CID) అదనపు డీజీ సునీల్‌కుమార్‌పై వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర హోంశాఖ స్పందించింది. సునీల్‌కుమార్ వ్యవహారంపై వచ్చిన 3 ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్‌ను ఆదేశించింది. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలు కోరుతూ సీఎస్‌కు లేఖ రాసింది.
సివిల్ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారని గతంలో సునీల్‌పై ఎంపీ రఘురామ (MP raghurama) ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ హోదాలో సమాజంలో అలజడి సృష్టించేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రఘురామ ఫిర్యాదు, సునీల్ ప్రసంగ వీడియోలను కేంద్ర హోంశాఖ రాష్ట్రానికి పంపింది. ఫిర్యాదు (complaint) ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఏ చర్యలు తీసుకున్నారో నివేదిక రూపంలో తమకు చెప్పాలని ఆదేశించింది. సునీల్ మత వ్యతిరేక ప్రచారం చేశారని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ అబ్జర్వేటరీ గతంలో ఫిర్యాదు చేసింది.
ఇదీ చదవండి: Revanth Reddy: ఎవరైనా తెలంగాణ వారే.. తేడా ఉండదు