ETV Bharat / city

కనకరాజు రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు: మంత్రులు - పద్మశ్రీ కనకరాజుకు మంత్రులు అభినందనలు

పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కనకరాజును... పలువురు మంత్రులు అభినందించారు. గుస్సాడి నృత్యానికి గుర్తింపు తేవడమే కాకుండా... రాష్ట్ర ప్రతిష్ఠను పెంచారని కొనియాడారు. ఇది ఆదివాసీలకు జాతీయస్థాయిలో దక్కిన గౌరవం అని అభిప్రాయపడ్డారు.

ministers appreciate kanakaraju for getting padmasri award
కనకరాజు రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు: మంత్రులు
author img

By

Published : Jan 26, 2021, 6:09 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మర్లవాయికి చెందిన కనకరాజు అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకోవడం పట్ల మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్ధాలుగా ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తూ... తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్న కనకరాజును... కేటీఆర్, హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాఠోడ్​ అభినందించారు.

  • ఆదివాసీ సంప్రదాయ గుస్సాడి నృత్యంలో ప్రావీణ్యం ఉన్న కనకరాజు గారికి నిన్న కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది

    వారు కుమురం భీం జిల్లా మర్లవాయి వాస్తవ్యులు. Shri కనకరాజు గారికి హార్దిక అభినందనలు 🙏 pic.twitter.com/jcCxf7rpNj

    — KTR (@KTRTRS) January 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కనగరాజు... గుస్సాడీ నృత్యానికి గుర్తింపు తేవడంతోపాటు రాష్ట్ర ప్రతిష్ఠను పెంచారని మంత్రులు కొనియాడారు. ఆదివాసీల ఆత్మగౌరవంగా నిలిచారని వ్యాఖ్యానించారు. కనకరాజుకు పురస్కారం రావడం... జాతీయ స్థాయిలో ఆదివాసీలకు దక్కిన గౌరవం అని అభిప్రాయపడ్డారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు.

  • కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన శ్రీ కనకరాజు గారు దేశ అత్యున్నత పురస్కారం పధ్మ శ్రీ అందుకోవడం గర్వంగా ఉంది. 4దశాబ్ధాలుగా ఆదివాసీల సాంప్రదాయ గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తూ తెలంగాణ ఖ్యాతిని చాటుతున్న కనకరాజు గారికి మనస్పూర్తిగా అభినంధనలు pic.twitter.com/yU4k54PWGp

    — Harish Rao Thanneeru (@trsharish) January 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: గుస్సాడీ కనకం.. ‘పద్మశ్రీ’ కిరీటం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.