కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు సహకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం రాంగోపాల్‌పేటలోని నల్లగుట్ట కంటైన్మెంట్ ప్రాంతంలో సోడియం హై పో క్లోరైడ్ పిచికారి చేస్తున్న తీరును పరిశీలించారు. తానే రసాయనాన్ని స్ప్రే చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక కార్పొరేటర్‌కు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నిత్యావసర వస్తువులు, మందులు, కూరగాయలు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకొని అవసరమైన మందులు అందజేయాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు.
ఇదీ చదవండి: ఈ కిట్‌తో 2 గంటల్లోనే 30 మందికి కరోనా పరీక్ష