ETV Bharat / city

దేశం గర్వపడేలా తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలన్న తలసాని

Talasani Distributed Fruits at Hospital దేశం గర్వపడేలా తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఇవాళ హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ప్రభుత్వాస్పత్రిలో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. వీరుల త్యాగాల ఫలితంగా స్వతంత్ర భారతావని ఏర్పడిందని, ఎందరో అమరవీరుల త్యాగఫలంతో తెలంగాణ సాధించుకున్నామని తలసాని గుర్తు చేశారు.

Talasani Distributed Fruits at Hospital
Talasani Distributed Fruits at Hospital
author img

By

Published : Aug 19, 2022, 12:39 PM IST

Talasani Distributed Fruits at Hospital : రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా.. రోగులకు మిఠాయిలు, పళ్లు పంపిణి చేస్తున్నారు. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. అమీర్‌పేటలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. వీరుల త్యాగాల ఫలితంగా స్వేచ్ఛాయుత భారతావని ఏర్పడిందని.. స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీ, భగత్ సింగ్, వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులను స్మరించుకోవాలి మంత్రి అన్నారు.

Talasani Distributed Fruits at Ameerpet Hospital : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రేపు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. 15 రోజులపాటు నిర్వహిస్తున్న వేడుకలకు సంబంధించి 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని వెల్లడించారు. దీనికి పెద్దఎత్తున ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ వేడుకల్లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్, శివమణి డ్రమ్స్, దీపికారెడ్డి బృందం నృత్యం, తెలంగాణా జానపద కళా రూపాలు, లేజర్ షో వంటి ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున క్రాకర్స్ ప్రదర్శన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రధానంగా భారతదేశ స్వతంత్ర పోరాటం, దేశభక్తి వెల్లివిరిసేలా ఉంటాయని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.