వలస కార్మికుల తరలింపుపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు సరిగా లేవని మంత్రి తలసాని శ్రీనివాస్ విమర్శించారు. మూడు రోజుల పాటు లాక్డౌన్ ఎత్తివేసి.. ఉచితంగా రైళ్లు ఏర్పాటుచేసిన తర్వాతే వలస కూలీలను తరలించాలని కోరారు. తెలంగాణకు సుదూర ప్రాంతాలైన బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌కు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాలకు బస్సుల ద్వారా వెళ్తే ఐదు రోజులు సమయం పడుతుందన్నారు. అన్ని రోజులు కలిసి వెళ్తే కరోనా వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉందన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాలు వచ్చే వరకు వలస కార్మికులంతా ఎక్కడి ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలని సూచించారు. ఒకవేళ ఫ్యాక్టరీలు తెరిస్తే.. అంతా ఒకేచోటరావడం కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. కూలీలను గమ్య స్థానాలకు చేర్చే బాధ్యత కేంద్రమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలే బస్సుల్లో తరలించుకోవాలని చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ఇవీచూడండి: మరో రెండురోజులు కేంద్ర బృందం పర్యటన