బడుగు బలహీన వెనుకబడిన వర్గాలకు కొండంత అండగా తమ పార్టీ మేనిఫెస్టో ఉందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తెరాస మేనిఫెస్టో విడుదల నేపథ్యంలో హైదరాబాద్ విద్యానగర్లో తెరాస శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాంనగర్ మీ సేవా కేంద్రం ముందు కార్యకర్తలు, నాయకులు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్... కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
హైదరాబాద్ ప్రజలకు ఎం చేస్తుందో చెప్పకుండా... జాతీయ పార్టీ భాజపా మేనిఫెస్టో విడుదల చేసిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజారంజకంగా ఉందన్నారు. నాయి బ్రాహ్మణులకు, రజకులకు ఉచితంగా విద్యుత్ ఇస్తామనడం పేదల పట్ల సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 25 వేల లోపు నీటిని వినియోగించే వారికి బిల్లు రద్దు నిర్ణయం చరిత్రాత్మకమన్నారు. భాజపా మత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. గ్రేటర్లో 100 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: గొగొయి కన్నుమూత- మోదీ సంతాపం