ETV Bharat / city

భువనేశ్వరి ప్రస్తావనే రాలేదు.. ఆయనే డ్రామా సృష్టించారు: పేర్ని నాని - Nandamuri Balakrishna fire on YCP news news

చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనలేదన్నారు ఏపీ మంత్రి పేర్నినాని(minister perni nani on chandrababu). ఎవరైనా ఏమైనా అని ఉంటే అసెంబ్లీలో తెదేపా సభ్యులు చేసిన ఫోన్ రికార్డును బయటపెట్టాలని డిమాండ్ చేశారు. శాసనసభలో చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి మెలో డ్రామా సృష్టించారన్నారు. నటులు బాలకృష్ణ ఆయన తోబుట్టువులు కూడా ఈ ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఎన్టీఆర్ గురించి వారికి చెడుగా నమ్మించగలిగిన చంద్రబాబు.. ఈ అంశంలో కూడా ఇలాగే చేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు.

perni nani
పేర్ని నాని
author img

By

Published : Nov 20, 2021, 3:43 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనలేదని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. శాసనసభలో ఆయన సతీమణి ప్రస్తావనే రాలేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై పురందేశ్వరి కూడా ట్వీట్ చేశారని.. ఆమెకు ఇదే చెబుతున్నామని పేర్కొన్నారు. నిజంగానే రాష్ట్ర చరిత్రలో నిన్న ఒక బ్లాక్ డే నే అన్న పేర్నినాని.. 40 ఏళ్ల రాజకీయ నాయకుడు చంద్రబాబు కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి చరిత్రను హీనం చేశారని ఆక్షేపించారు(perni nani comments on chandrababu).

బాలకృష్ణ అమాయక చక్రవర్తి..

బాలకృష్ణ ఒక అమాయక చక్రవర్తి.. ఆయన బావ ఏమి చెబితే అదే నమ్మేస్తున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు( perni nani clarity on chandrababu issue). చంద్రబాబు చెప్పుడు మాటలను విని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు స్పందించారన్నారు. తోబుట్టువు లాంటి వ్యక్తిని ఎవరూ ఏమీ అనలేదని పదేపదే చెబుతున్నామని తెలిపారు. దేవాలయం లాంటి శాసనసభలో బూతుల సంస్కృతిని ప్రవేశపెట్టిందే చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి మెలో డ్రామా సృష్టించారని ఆరోపించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను, ఆయన సతీమణి పేరును శాసనసభ లో ఎవరు ఉచ్చరించలేదని స్పష్టం చేశారు. రాజకీయాలను రాజకీయలతోనే ఎదుర్కోవాలన్న ఆయన.., కుటుంబ మర్యాదను పక్కన పెట్టి చంద్రబాబు ఈ డ్రామా చేశారని దుయ్యబట్టారు.

ఆ ఫోన్ రికార్డును బయట పెట్టండి..
అసెంబ్లీలో ఫోన్లతో రికార్డు చేయకూడదని.. కానీ తెదేపా సభ్యులు రికార్డు చేసిన వీడియోను అందరికి పంపారన్నారు. చంద్రబాబు సతీమణిని ఎవరైనా ఏమైనా అని ఉంటే ఆ ఫోన్ రికార్డును బయట పెట్టాలని పేర్ని నాని డిమాండ్‌ చేశారు. అసలు చంద్రబాబు సతీమణి ప్రస్తవన శాసనసభలో రాలేదని తెలిపారు. ఆమె పేరును శాసనసభలో ప్రస్తావించినట్టుగా చంద్రబాబు చిత్రీకరణ చేస్తున్నారని విమర్శించారు. అనని మాటలను ఇద్దరు శాసన సభ్యులకు ఆపాదించటం రాజకీయంగా దుర్మార్గపు ప్రక్రియగా పేర్నొన్నారు. నటులు బాలకృష్ణ ఆయన తోబుట్టువులు కూడా ఈ ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఎన్టీఆర్ గురించి వారికి చెడుగా నమ్మించగలిగిన చంద్రబాబు.. ఈ అంశంలో కూడా ఇలాగే చేస్తున్నారని పేర్నినాని ఆరోపించారు. సాగుచట్టాలను వెనక్కు తీసుకునేలా(Farm laws repealed news) చేసిన రైతుల విజయాన్ని సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ చేస్తోందని ఆయన తెలిపారు.

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. హెచ్చరించిన బాలకృష్ణ

అంతకుముందు మీడియా సమావేశంలో మాట్లాడిన నందమూరి కుటుంబసభ్యులు.. చంద్రబాబుపై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తన సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమన్న బాలకృష్ణ(Nandamuri Balakrishna fire on YCP news) .. అసెంబ్లీలో ఉన్నామో, పశువుల కొట్టంలో ఉన్నామో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విర్రవీగి మాట్లాడేవారు ఇకపై నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడిపెట్టుకోవటం ఎప్పుడూ లేదని నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడాల్సిన అసెంబ్లీలో అభివృద్ధిపై బదులు.. వ్యక్తిగత అజెండా తీసుకువచ్చారని మండిపడ్డారు. వైకాపా నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారన్న బాలకృష్ణ.. అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారని.. హేళన చేయవద్దని హితవు పలికారు. ఈ పరిణామాలతో కొత్త నీచ సంస్కృతికి తెరలేపారని ఆక్షేపించారు. రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలు గమనిస్తున్నారన్నారు.

ఇక ఉపేక్షించేది లేదు..

ఆడవాళ్ల జోలికొస్తే చేతులు ముడుచుకోవడం సరికాదు. మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం. మంగళగిరిలో పార్టీ కార్యాలయంపై దాడి చేయించారు. చంద్రబాబుపై ఎన్నోవిధాలుగా దాడులకు ప్రయత్నించినా ఆయన సంయమనంతో ఉన్నారు. ఇకపై ఎవరు నోరు తెరిచినా ఉపేక్షించేది లేదు. ఆడవాళ్లను తెరపైకి తెచ్చి రాజకీయాల్లో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు. రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారు.. మీకు దాసోహం చేసేలా చేసుకోవడం మంచిది కాదు. - నందమూరి బాలకృష్ణ

సీఎం కొడుకుగా కానీ... సీఎంకు బావమరిదిగానూ తాను ఏనాడు మాట్లాడలేదని బాలకృష్ణ అన్నారు. అసెంబ్లీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని సూచించారు. తమను అడ్డుకునే ఎలాంటి కుట్రలనైనా తిప్పికొడతామన్న బాలకృష్ణ.. మీ వేషం, భాష, ఆహార్యం చూస్తే గొడ్లచావిడికి వచ్చినట్లుందని మండిపడ్డారు. రాజకీయాలతో సంబంధం లేని వారిపై మాటల దాడి సరికాదని హితవు పలికారు. ఇదే తీరు కొనసాగితే ఆవేశానికి అడ్డుకట్ట ఉండదని, ఏం అడ్డుపెట్టుకున్నా బద్ధలు కొట్టుకొస్తామని బాలకృష్ణ హెచ్చరించారు.

ఇదీ చదవండి: Balakrishna Warning TO YCP LEADERS : 'నందమూరి కుటుంబం జోలికొస్తే ఖబడ్దార్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.