ETV Bharat / city

'కేంద్రం చట్టాలతో మార్కెట్లు ఆర్థిక వనరులు కోల్పోతాయి' - మంత్రి నిరంజన్‌రెడ్డి వార్తలు

ఒప్పంద సేద్యం, మార్కెట్ల చట్టాలు, కేంద్ర ఆర్డినెన్స్‌పై చర్చించేందుకు మార్కెటింగ్ ఉన్నతాధికారులు, కేంద్ర ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఆర్డినెన్స్ అమలు చేసేందుకు ఆదేశాలివ్వాలని కేంద్ర ప్రతినిధులు కోరారు. న్యాయ సలహా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ముందుకెళ్తామని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర చట్టాలతో స్థానిక మార్కెట్లు ఆర్థిక వనరులు కోల్పోతాయని అన్నారు.

niranjan reddy
niranjan reddy
author img

By

Published : Jul 10, 2020, 7:03 PM IST

Updated : Jul 10, 2020, 7:18 PM IST

న్యాయ సలహా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర ఆర్డినెన్స్‌ అమలుపై ముందుకు వెళ్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఒప్పంద సేద్యం, మార్కెటింగ్ చట్టాలకు సంబంధించిన కేంద్ర ఆర్డినెన్స్‌పై మార్కెటింగ్ ఉన్నతాధికారులు, కేంద్ర ప్రతినిధులతో హైదరాబాద్‌లో మంత్రి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రతినిధులు డాక్టర్ అనిల్ కుమార్, లక్ష్మీదేవి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు, రవికుమార్, పర్యవేక్షక ఇంజినీరు ఉమామహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

అలా అయితే ఆర్థిక వనరులు కోల్పోతాం

ఒప్పంద సేద్యం, మార్కెట్ల చట్టాలు, కేంద్ర ఆర్డినెన్స్, ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర ఆర్డినెన్స్ అమలు చేసేందుకు ఆదేశాలివ్వాలని కేంద్ర ప్రతినిధులు మంత్రిని కోరారు. కేంద్ర చట్టాలతో స్థానిక మార్కెట్లు ఆర్థిక వనరులు కోల్పోతాయని మంత్రి ప్రస్తావించారు. ఆర్థిక వనరులు పెంపొందించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం... కొనడానికి మద్దతు ధరకు కొనుగోలు చేసే పంటలు మార్కెట్ యార్డుల్లో మార్కెట్ కమిటీలచే కొనుగోలు అనుమతికి ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నామని ప్రకటించారు.

రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు

గడ్డిఅన్నారం నుంచి పండ్ల మార్కెట్​ను కొహెడకు తరలించడంపై... మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సంప్రదింపులు జరిపి.. పూర్తి స్థాయి అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో పత్తి అధికంగా సాగు చేస్తున్న నేపథ్యంలో అన్ని మార్కెట్లలో పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని మార్కెటింగ్ శాఖ సంచాలకులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. భారత టెక్స్ టైల్ కార్యదర్శి సూచనల మేరకు వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతుబజార్లు మార్కెట్ కమిటీ నిధులపై ఆధారపడకుండా స్వతంత్రంగా నిర్వహించుకునేందుకు మార్కెటింగ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందన్నారు. జిల్లా,రాష్ట్ర స్థాయిలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కూల్చివేత ఎఫెక్ట్​: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం ​విచారం

Last Updated : Jul 10, 2020, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.