ETV Bharat / city

"యూరియా అక్రమాలను సహించేది లేదు"

యూరియా పక్కదారి పట్టిందన్న కథనాలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి స్పందించారు. యూరియా తరలింపులో అక్రమాలు జరిగాయన్న వార్తలపై మండిపడ్డారు. విచారణ జరిపించాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  చెప్పారు.

యూరియా అక్రమార్కులను సహించం: మంత్రి
author img

By

Published : Oct 10, 2019, 10:12 PM IST

యూరియా అక్రమార్కులను సహించం: మంత్రి

రాష్ట్రంలో యూరియా పక్కదారి పట్టిందన్న కథనాలపై వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. ఇకపై అక్రమార్కులను ఏ మాత్రం సహించబోమంటూ హెచ్చరించారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొని యూరియా రవాణా చేస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడవద్దని, నిత్యం యూరియా రవాణాకు సంబంధించి పర్యవేక్షిస్తున్నామని... పాయింట్ ఆఫ్ సేల్ - పాస్ ద్వారా ఆన్‌లైన్ విధానం అమలు చేస్తున్నప్పటికీ... అవినీతి, అక్రమాలు జరిగాయన్న వార్తలపై మండిపడ్డారు. ఈ మేరకు విజిలెన్స్ విచారణ జరిపించాలంటూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధికి ఆదేశాలు జారీ చేశారు. అక్రమాలు జరిగినట్లు తేలితే... బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం, రైతుల పట్ల బాధ్యతరాహిత్యాన్ని సహించేది లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడిచే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇవీ చూడండి: కృష్ణానది నీటి కేటాయింపులు, వినియోగంపై రేపు ఉత్తర్వులు!

10-10-2019 TG_HYD_59_10_MINISTER_ON_UREA_DRY_3038200 REPORTER : MALLIK.B ( ) రాష్ట్రంలో యూరియా పక్కదారి పట్టాయన్న కథనాలపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. ఇకపై అక్రమార్కులను ఏ మాత్రం సహించబోమంటూ హెచ్చరించారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. యూరియా పక్కదారి పట్టాయన్న వార్తలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొని యూరియా రవాణా చేస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడవద్దని నిత్యం యూరియా రవాణాకు సంబంధించి పర్యవేక్షిస్తున్నామని... పాయింట్ ఆఫ్ సేల్ - పాస్ ద్వారా ఆన్‌లైన్ విధానం అమలు చేస్తున్నప్పటికీ... అవినీతి, అక్రమాలు జరిగాయన్న వార్తలపై మండిపడ్డారు. ఈ మేరకు విజిలెన్స్ విచారణ జరిపించాలంటూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధికి ఆదేశాలు జారీ చేశారు. అక్రమాలు జరిగినట్లు తేలితే... బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం, రైతుల పట్ల బాధ్యతరాహిత్యాన్ని సహించేది లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడిచే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. DRY...........
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.