ETV Bharat / city

పత్తి కొనుగోళ్లకు జిల్లాకో కాల్ సెంటర్: మంత్రి నిరంజన్​రెడ్డి - మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ళకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పత్తి కొనుగోలు కేంద్రాలు, నాణ్యత ప్రమాణాలు, సకాలంలో రైతులకు నగదు చెల్లింపులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

minister niranjan reddy revie on cotton procurement
పత్తి కొనుగోళ్లు, చెల్లింపుల, సౌకర్యాలపై మంత్రి సమీక్ష
author img

By

Published : Oct 19, 2020, 5:10 PM IST

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ళకు సంబంధించి జిల్లాకో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్​ మినిస్టర్స్​ క్వార్టర్స్​లోని తన నివాసంలో 2020-12 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌ సంబంధించి పత్తి కొనుగోళ్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పత్తి కొనుగోలు కేంద్రాలు, నాణ్యత ప్రమాణాలు, సకాలంలో రైతులకు నగదు చెల్లింపులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

సమన్వయంతో పనిచేయాలి..

జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా సమన్వయ కమిటీలు కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. కాల్‌ సెంటర్ ద్వారా రైతుల ఫిర్యాదులు, సూచనలు, సలహాలు స్వీకరించాలని ఆదేశించారు. 300 జిన్నింగ్ మిల్లులు, 9 వ్యవసాయ మార్కెట్ యార్డులతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సీసీఐ సిద్ధంగా ఉన్నందున మిల్లర్లు ఒప్పందాలు చేసుకోవాలని మంత్రి సూచించారు. మార్కెటింగ్, వ్యవసాయ, పోలీస్, రవాణా, అగ్నిమాపక, తూనికలు, కొలతల శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.

అదనంగా చెల్లిస్తాం..

కొనుగోలు కేంద్రానికి వచ్చిన పత్తి ఎట్టి పరిస్థితుల్లో అకాల వర్షాల వల్ల తడిచే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. 8 శాతం తేమ గల పత్తి క్వింటాల్​కు రూ. 5825, 9 శాతం తేమ ఉంటే రూ. 5766.75, 10 శాతం ఉంటే రూ.5708.50, 11 శాతం ఉంటే రూ. 5650.25, అదే 12 శాతం తేమ ఉంటే రూ. 5582 చొప్పున కనీస మద్ధతు ధరలు లభిస్తాయని వివరించారు. సీసీఐ సూచించిన 8 శాతం తేమ కన్నా తక్కువగా... 6 శాతం తేమ ఉంటే మద్దతు ధర అదనంగా రూ. 116.50, 7 శాతం తేమ ఉంటే రూ.58.25 చెల్లిస్తామన్నారు.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

కొనుగోలు కేంద్రాల వద్ద వెబ్ కెమెరాలు, ఫింగర్ ఫ్రింట్​ స్కానర్లు, తేమ యంత్రాలు, ఎలక్ట్రానిక్ కాంటాలు, ఆపరేటర్లను సిద్ధంగా ఉంచుకోవడం సహా తూనికలు, కొలతలశాఖతో అన్ని అనుమతులు తీసుకోవాలని మంత్రి సూచించారు. వ్యవసాయ శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం ఏఈఓలు, ఏఓలు, ఇతర అధికారులు సమన్వయంతో గ్రామాలవారీగా టోకెన్లు జారీ చేసి... కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి వేచిచూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

కొనుగోలు కేంద్రాల వివరాలు, నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు రైతులకు చేరేలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ... కేంద్రాల వద్ద కూడా ప్రదర్శించాలని పేర్కొన్నారు. సమీక్షలో మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు రవికుమార్, సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: మరోసారి భారీ వర్షసూచన.. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.