కుంభవృష్టికి అతలాకుతలమైన హైదరాబాద్‌లోని వరద ప్రభావిత కాలనీల్లో... పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మూడోరోజూ పర్యటిస్తున్నారు. ఖైరతాబాద్‌లోని బీఎస్ మక్త కాలనీలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్‌ని పరిశీలించారు. అక్కడ అందిస్తున్న సౌకర్యాలపై వరద బాధితుల్ని ఆరా తీశారు. వరద వల్ల ఇబ్బందులు పడుతున్న అందరికి రేషన్ కిట్ అందించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టిందని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయని... కాలనీల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
ప్రజలంతా కచ్చితంగా తాగునీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న కేటీఆర్... కాచివడపోసిన నీటిని తాగాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో ఉన్న వారందరికీ ఇప్పటికే ఆహారంతో పాటు దుప్పట్లు, మందులు అందిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
ఇవీ చూడండి: వరద ప్రాంతాల్లో పోలీసుల సహాయక చర్యలు.. అధికారుల ప్రశంసలు