KTR on Secretariat Temple: సచివాలయంలో మందిరం నిర్మిస్తాం, మజీద్ నిర్మిస్తాం, చర్చిని కూడా నిర్మిస్తాం.. నిశ్చింతంగా ఉండండి అని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సచివాలయంలో మందిర నిర్మాణంపై ఓ నెటిజన్ ట్విట్టర్లో అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. తాము మతం ముసుగులో రాజకీయాలు చేయమని... కేసీఆర్ నాయకత్వంలో.. అన్ని మతాలను సమానంగా చూస్తున్న రాష్ట్రం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
-
Mandir Bhi Banega, Masjid Bhi Banega aur Church Bhi Banega! Aap Befikar Rahiye !!
— KTR (@KTRTRS) April 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
This is Telangana under the leadership of #KCR who respects all faiths equally & doesn’t indulge in politics in the guise of Religion https://t.co/VC3Sq8BcOf
">Mandir Bhi Banega, Masjid Bhi Banega aur Church Bhi Banega! Aap Befikar Rahiye !!
— KTR (@KTRTRS) April 17, 2022
This is Telangana under the leadership of #KCR who respects all faiths equally & doesn’t indulge in politics in the guise of Religion https://t.co/VC3Sq8BcOfMandir Bhi Banega, Masjid Bhi Banega aur Church Bhi Banega! Aap Befikar Rahiye !!
— KTR (@KTRTRS) April 17, 2022
This is Telangana under the leadership of #KCR who respects all faiths equally & doesn’t indulge in politics in the guise of Religion https://t.co/VC3Sq8BcOf
సచివాలయ ప్రాంగణంలో గతంలో ఉన్న మసీదులు, ఆలయం, చర్చిలను పాత భవనాల కూల్చివేత సందర్భంగా తొలగించారు. వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపడతామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఒక్కో ప్రార్థనా మందిరానికి 1500 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.
మరోవైపు సచివాలయ నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. వచ్చే దసరా నాటికి కొత్త సచివాలయ భవనాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఇంజినీర్లు, గుత్తేదారుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా పనులు వేగవంతం చేశారు. మొత్తం 1,250 మంది కార్మికులు సచివాలయ పనుల్లో నిమగ్నమయ్యారు. 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లోనూ పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన ఇతర పనులను కూడా సమాంతరంగా చేపడుతున్నారు.
ఇదీ చదవండి: 'ఆహ్వానాలు అందినవారే ఆవిర్భావ సభకు రావాలి.. పాసులు పంపిస్తున్నాం'