తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ప్రముఖ సినీ నటుడు ప్రియదర్శి తండ్రి ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి ఈ గీతాన్ని రచించారు. ప్రగతి భవన్లో.. ప్రియదర్శి తన తల్లిదండ్రులతో మంత్రిని కలిసి పాటను గురించి వివరించారు. పాటను ఆవిష్కరించిన కేటీఆర్కు ప్రియదర్శి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, శిల్ప కళను గురించి వర్ణించే ఈ పాట బాగుందని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ప్రొఫెసర్ సుబ్బాచారి రచించిన ఈ గీతానికి సంగీతాన్ని వి.రాధ సమకూర్చారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు కృష్ణ చైతన్య, కల్పన, హరిణి, సాయిచరణ్ ఆలపించారు.
ఇవీచూడండి: చర్చలు సఫలం.. విధుల్లో చేరిన జూడాలు