ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి ద్వాదశ దినకర్మ హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. విజయలక్ష్మికి నివాళులర్పించి.. పుష్పాంజలి ఘటించారు.
అనంతరం వెంకటేశ్వర్లును, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి కేటీఆర్ వెంట ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఎమ్మెల్యే కృష్ణారావులు ఉన్నారు.