KTR Work From Home: పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వర్క్ ఫ్రం హోం విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. కింద పడి చీలమండకు గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు మూడు వారాల పాటు విశ్రాంతిలో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా.. వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్.. తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. తాను ఇంటి నుంచి పని చేస్తూ.. కొన్ని దస్త్రాలు పరిశీలిస్తున్నట్లు ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
రెండు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ కాలికి.. ప్రమాదవశాత్తు గాయమైంది. ఈ క్రమంలో వైద్యులు ఆయనకు మూడు వారాల విశ్రాంతి సూచించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్.. ఆయన అభిమానులతో ట్విటర్ వేదికగా తెలిపారు. తన జన్నదినానికి ముందు రోజునే ఇలా జరిగింది. అయితే.. విశ్రాంతి సమయంలో చూసేందుకు ఓటీటీలో ఏవైనా మంచి కార్యక్రమాలు, సినిమాలు సూచించాలని ట్వీట్లో కేటీఆర్ కోరగా.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. చాలా వరకు నెటిజన్లు తమకు తెలిసిన, నచ్చిన సినిమాలు, సిరిస్‌లు, కార్యక్రమాల పేర్లను సూచించారు.
మరోవైపు.. ఇలా సినిమాల గురించి అడగటాన్ని కొంతమంది వ్యతిరేకించారు కూడా. మరికొంత మంది మాత్రం ఇవేవి కాకుండా వాళ్లకు తెలిసిన మరిన్ని సూచనలు చేశారు. అయితే అందులో.. క్షేత్రస్థాయికి వెళ్లలేకున్నా వర్క్ ఫ్రం హోం చేయొచ్చన్న సూచన కూడా ఉంది. కట్ చేస్తే.. మంత్రి ఈరోజు దస్త్రాలను పరిశీలిస్తున్న ఫొటోను ట్విటర్లో పంచుకుంటూ.. వర్క్ ఫ్రం హోం చేస్తున్నట్లు తెలిపారు. ఇదంతా చూస్తుంటే.. నెటిజన్ల నుంచి వచ్చిన వర్క్ ఫ్రం హోం సలహాలను మంత్రి కేటీఆర్ తీసుకున్నట్టే కనిపిస్తోంది.
-
Getting some file work done #WorkFromHome pic.twitter.com/SC2v7RtI5j
— KTR (@KTRTRS) July 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Getting some file work done #WorkFromHome pic.twitter.com/SC2v7RtI5j
— KTR (@KTRTRS) July 26, 2022Getting some file work done #WorkFromHome pic.twitter.com/SC2v7RtI5j
— KTR (@KTRTRS) July 26, 2022
ఇవీ చూడండి: