ETV Bharat / city

KTR Charity: కేటీఆర్​ దాతృత్వం.. పంజాబ్​కు చెందిన దివ్యాంగ క్రీడాకారిణికి ఆపన్నహస్తం

author img

By

Published : Jan 3, 2022, 10:20 PM IST

KTR Charity: మంత్రి కేటీఆర్​ మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. పంజాబ్​కు చెందిన ఓ దివ్యాంగ క్రీడాకారిణి మాలిక హండకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తాను వ్యక్తిగతంగా సాయపడతానని హామీ ఇచ్చారు.

KTR Charity
ktr

KTR Charity: పంజాబ్​కు చెందిన దివ్యాంగ క్రీడాకారిణి మాలిక హండకు సాయం చేసేందుకు మంత్రి కేటీఆర్​ ముందుకొచ్చారు. మాలిక హండ చెస్​లో ప్రతిభ పాటవాలు ప్రదర్శిస్తూ పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పతకాలను సాధించారు. అయితే ఎలాంటి సహకారం అందడం లేదన్న ఆమె వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది.

ఈ వీడియోపై స్పందించిన కేటీఆర్... వ్యక్తిగతంగా తాను సాయం చేస్తానని ప్రకటించారు. ఆ వెంటనే కేటీఆర్ కార్యాలయ సిబ్బంది మాలిక కుటుంబ సభ్యులను సంప్రదించి ఈ విషయాన్ని తెలియజేశారు. దీనిపై మాలిక కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ కుమార్తెకు సాయం అందించేందుకు ముందుకురావడంపై కేటీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీచూడండి: KCR Review on Corona: రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు : సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.