ETV Bharat / city

KTR On Protests: 'మోదీకి సెగ తగిలేలా.. తెలంగాణ తడాఖా చూపించాలి' - తెలంగాణలో ధాన్యం కొనుగోలు సమస్య

KTR On Protests: ధాన్యం కొనుగోలుపై కేంద్రం దిగివచ్చే దాకా పెద్దఎత్తున కార్యాచరణ ఉంటుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి, కేంద్రానికి ఈ సెగలు తగిలేలా పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.

ktr on trs protest
ktr
author img

By

Published : Apr 4, 2022, 5:36 AM IST

Updated : Apr 4, 2022, 6:32 AM IST

KTR On Protests: తెలంగాణలో అన్నదాతల ఉసురుపోసుకుంటున్న కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి రాష్ట్ర తడాఖా చూపించాలని.. గల్లీ నుంచి దిల్లీ దాకా నిరసనలు దద్దరిల్లాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీకి, కేంద్రానికి ఈ సెగలు తగిలేలా పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం దిగివచ్చే దాకా పెద్దఎత్తున కార్యాచరణ ఉంటుందని.. ఇందులో ప్రజలు, రైతులను భాగస్వాములను చేయాలన్నారు. అన్నదాతల ఆగ్రహాన్ని ఉద్యమరూపంలో వెల్లడించేందుకు కృషి చేయాలని చెప్పారు.

పంజాబ్‌ తరహాలో తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు కోసం తెరాస చేపట్టిన అయిదంచెల ఆందోళన కార్యక్రమాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా మంత్రులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు కేటీఆర్‌ తన నివాసం నుంచి ఆదివారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత నవంబరు నుంచి ధాన్యం సేకరణ సమస్యను కేంద్రం దృష్టికి తెచ్చినా.. ఏ మాత్రం స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలు పూర్తిగా అన్నదాతలకు వ్యతిరేకంగా ఉన్నాయి. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, బ్యాంకులను ముంచిన వారికి రూ.వేల కోట్ల లాభం కలిగిస్తూ రైతున్నల కోసం కొద్ది మొత్తాన్ని చెల్లించలేక చేతులెత్తేస్తోంది. రాష్ట్రం నుంచి పంపిన ప్రతిపాదనలన్నింటినీ కేంద్రం అటకెక్కిస్తోంది. ఇప్పుడు రాజకీయ కారణాలతో రైతులకు అన్యాయం చేయాలనే భాజపా వైఖరిని ఎండగట్టేందుకే కేసీఆర్‌ ఆదేశాల మేరకు పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్నాం.

ఉద్యమస్ఫూర్తితో పాల్గొనాలి..

ధాన్యం సేకరణ సమస్యను పరిష్కరించాలని ఎన్ని విన్నపాలు చేసినా విననందుకే సమరభేరి మోగించాం. సోమవారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నాం. ఆ తర్వాత 11 వరకు వివిధ దశల్లో కార్యక్రమాలుంటాయి. పార్టీ శ్రేణులు ఉద్యమస్ఫూర్తితో పాల్గొనాలి. మంత్రులు జిల్లాల సమన్వయ బాధ్యతలు నిర్వహించాలి. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యవేక్షించాలి. ఈ నెల 11న జరిగే ‘చలో దిల్లీ’కి ముఖ్యనేతలు సన్నద్ధం కావాలి’’ అని కేటీఆర్‌ సూచించారు.

ఇదీచూడండి: 'కేంద్రంపై తెరాస ప్రకటించిన ఉద్యమానికి రైతులంతా కదిలిరావాలి..'

Last Updated : Apr 4, 2022, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.