ETV Bharat / city

సురవరం అంటే గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక : మంత్రి కేటీఆర్ - telangana municipal minister ktr

ఎంతకాలం జీవించామన్నది కాదు.. ఎలా జీవించామన్నదే ముఖ్యమని సురవరం ప్రతాపరెడ్డి నిరూపించారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్​లో సురవరం ప్రతాపరెడ్డి జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

minister ktr about suravaram pratapa reddy
సురవరం అంటే గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక
author img

By

Published : Dec 28, 2020, 12:43 PM IST

Updated : Dec 28, 2020, 1:29 PM IST

తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్​ బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో సురవరం ప్రతాపరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సురవరం అంటే ముందుగా గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక అని కేటీఆర్ తెలిపారు.

ఎంతకాలం జీవించామన్నది కాదు.. ఎలా జీవించామన్నదే ముఖ్యమని సురవరం ప్రతాపరెడ్డి నిరూపించారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుతోనే సాంస్కృతిక పునరుజ్జీవం సాధ్యమైందని తెలిపారు. 125 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకునేలా తనదైన ముద్రవేసిన వ్యక్తి సురవరం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్​లు పాల్గొన్నారు.

సురవరం అంటే గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక : మంత్రి కేటీఆర్

Last Updated : Dec 28, 2020, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.