ETV Bharat / city

సీఎం కేసీఆర్‌ ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ము అమిత్​షాకు లేదన్న మంత్రులు - munugode BJP meeting

Jagadeesh reddy Comments మునుగోడు సభలో కేంద్రమంత్రి అమిత్​ షా చేసిన వ్యాఖ్యలపై మంత్రులు జగదీశ్​రెడ్డి, కొప్పుల ఈశ్వర్​ స్పందించారు. ఎప్పటిలాగే మునుగోడులోనూ అమిత్​షా అబద్దాలే మాట్లాడారని మంత్రి ఆరోపించారు. మునుగోడు ప్రజలు భాజపాకే మీటరు పెట్టడం ఖాయమని తెలిపారు.

Minister Jagadeesh reddy Comments on Amit shah speech in munugode meeting

author img

By

Published : Aug 21, 2022, 8:40 PM IST

Updated : Aug 21, 2022, 9:11 PM IST

Jagadeesh reddy Comments: మునుగోడు సభలో కేంద్ర మంత్రి అమిత్​ షా అబద్దాలే మాట్లాడారని మంత్రి జగదీశ్​రెడ్డి ఆరోపించారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ వేసిన ఒక్క ప్రశ్నకు కూడా అమిత్​షా వద్ద సమాధానం లేదన్నారు. ఫ్లోరైడ్​ నివారణ కోసం జిల్లా ప్రజలు దిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రికి మొరపెట్టుకుంటే ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. పెట్రోల్‌ ధరలపై అమిత్ షా మాటలు దొంగేదొంగ అన్నట్లుందని ఎద్దేవా చేశారు. మునుగోడు ప్రజలు భాజపాకు డిపాజిట్ రాకుండా చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

"మునుగోడులోనూ అమిత్ షా అబద్ధాలే మాట్లాడారు. ఆధారం లేకుండా మాట్లాడే బండి సంజయ్ పాత్ర పోషించారు. కేసీఆర్ ఒక్క ప్రశ్నకూ అమిత్ షా వద్ద సమాధానం లేదు. సీఎం కేసీఆర్‌ ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముకూడా లేదు. ప్రపంచంలోనే అద్భుత పథకం రైతుభీమా. ఫ్లోరైడ్‌ నివారణకు ప్రధానమంత్రి ఏమైనా చేశారా?. పెట్రోల్‌ ధరలపై అమిత్ షా మాటలు దొంగేదొంగ అన్నట్లుంది. మునుగోడు ప్రజలు భాజపాకే మీటరు పెడతారు. మునుగోడు ప్రజలు భాజపాకు డిపాజిట్ రాకుండా చేస్తారు."- జగదీశ్‌రెడ్డి, మంత్రి

అమిత్‌ షా సమావేశంపై భాజపా శ్రేణులు అమితంగా పెట్టుకున్న ఆశలు నీరుగారాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. మునుగోడు సభ అట్టర్​ఫ్లాప్ అయ్యిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సభకు జనం స్వచ్ఛందంగా తరలివస్తే.. అమిత్‌ షా సభకు ఒక్కొక్కరికి వెయ్యి లెక్కన ఇచ్చి తీసుకొచ్చారని ఆరోపించారు. సభికుల నుంచి కనీస స్పందన లేకపోవడంతో 15 నిమిషాలలో షా ప్రసంగం ముగించి వెనుతిరిగారని దుయ్యబట్టారు. మునుగోడులో తిరిగి గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

Last Updated : Aug 21, 2022, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.