సింగూరు ప్రాజెక్టు నుంచి సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, ఆందోళ్ నియోజకవర్గాలకు నీరందించే ప్రణాళికలు తయారు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు. తద్వారా రెండున్నర లక్షల ఆయకట్టుకు నీరందుతుందని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతానని చెప్పారు. హైదరాబాద్ అరణ్య భవన్లో మెదక్, సంగారెడ్డి జిల్లాల నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్‌ల ద్వారా తెలంగాణలోని నాలుగు నియోజకవర్గాలకు సాగు నీరందేలా ప్రణాళికలు తయారు చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ ఆధీనంలో ఉన్న భూములు రక్షించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 17, 18, 19 పనులు జరుగుతున్న తీరు తెలుసుకుని వేగంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : రాష్ట్రానికి మరోసారి స్కోచ్ అవార్డులు