Harish Rao on Ibrahimpatnam incident: ఇబ్రహీంపట్నం ఘటన దురదృష్టకరమని వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గంటగంటకు సమీక్షిస్తూ... బాధితులకు బాసటగా నిలుస్తున్నామని వివరించారు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందడం బాధాకరమన్నారు. ఘటనకు బాధ్యుడైన వైద్యుడి లైసెన్స్ రద్దు చేశామని, సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించి.. వారికి భరోసానిచ్చారు. ఇన్‌ఫెక్షన్ తగ్గిందని రెండు మూడు రోజుల్లో డిశార్చ్ చేస్తామని హరీశ్‌రావు స్పష్టంచేశారు.
ఘటన జరిగిన మరుక్షణం నుంచి క్షణక్షణం పరీక్షిస్తూ కాపాడుకుంటుంటే.. ప్రతిపక్షాలు ఈరోజు ఆస్పత్రికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుందని.. ఇళ్లలో ఉన్నవాళ్లను కూడా అంబులెన్స్ పంపి ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఆరోగ్యశాఖ అధికారులు సైతం ఇక్కడే ఉంటూ.. గంటగంటకు మానిటర్ చేస్తున్నామని వివరించారు. బాధితులకు 5 లక్షల పరిహారంతో పాటు డబుల్ బెడ్ రూం ఇళ్లు అందజేస్తామని తెలిపారు.
"ఇబ్రహీంపట్నం ఘటన దురదృష్టకరం. రాష్ట్రంలో ఏడేళ్లలో 12లక్షల కుని ఆపరేషన్‌లు చేశాం. ఎప్పుడూ ఇలాంటి దురదృష్టకర ఘటన జరగలేదు. శస్త్రచికిత్స చేసిన వైద్యుడి లైసెన్స్‌ను రద్దు చేశాం. విపక్ష నేతలు ఇప్పుడొచ్చి రాజకీయం చేస్తున్నారు. గంటగంటకు బాధితుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. బాధితులకు రూ.5లక్షల పరిహారం, 2 పడకల ఇళ్లు అందిస్తాం. ఇన్ఫెక్షన్ వల్లే మరణించినట్టు ప్రాథమిక నిర్ధరణ. ప్రస్తుతం అపోలో 13 మంది, నిమ్స్‌లో 17 మంది ఉన్నారు. వాళ్లకు కూడా ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టింది. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృత్తం కాకుండా జాగ్రత్తపడతాం." -హరీశ్‌రావు, ఆరోగ్యశాఖ మంత్రి
ఇవీ చూడండి: