ETV Bharat / city

తెలంగాణ మెడికల్ హబ్​గా మారుతుంది: మంత్రి హరీశ్​రావు - అవార్డులు ప్రధానం చేసిన హరీశ్​రావు

Hybiz TV Healthcare Awards 2022: ప్రముఖ హైబిజ్ సంస్థ ఆరోగ్య రంగంలో ఉత్తమ సేవలందిస్తున్న వైద్యులకు పురస్కారాలను ప్రకటించింది. ఈ వేడుకకు భారత మాజీ క్రికెట్ కపిల్​దేవ్​తో కలిసి మంత్రి హరీశ్​రావు ముఖ్య అతిథిగా హాజరై.. పలువురు వైద్యులకు పురస్కారాలను ప్రదానం చేశారు.

minister harishrao
మంత్రి హరీశ్​రావు
author img

By

Published : Oct 9, 2022, 11:43 AM IST

Hybiz TV Healthcare Awards 2022: చాలామంది వైద్యులు రోగుల అవసరానికి మించి ప్రిస్కిప్షన్స్ రాస్తున్నారని, అది మంచి పద్దతి కాదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు హెచ్చరించారు. ప్రముఖ హైబిజ్​ సంస్థ ఆరోగ్య రంగంలో ఉత్తమ సేవలు అందించిన వైద్యులకు పురస్కారాలు అందిస్తోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మంత్రి హరీశ్​రావు, భారత మాజీ క్రికెటర్​ కపిల్​దేవ్​ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వైద్య వృత్తి ఎంతో ముఖ్యమైనదని.. అలాంటిది కొందరు డాక్టర్​లు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. దేశంలో అన్నం పండించే రైతుకు, దేశాన్ని కాపాడే జవాన్​కు ఉన్నంత మంచి పేరు కొందరి వైద్యుల వల్ల మంచి వైద్యులకు ఉండటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మెడికల్ హబ్​గా మారుతుందని మంత్రి తెలిపారు. ఇప్పుడు ఈ అవార్డులు అందుకున్న డాక్టర్లకు శుభాకాంక్షలు అన్నారు.

ప్రముఖ హైబిజ్ సంస్థ ఆరోగ్య రంగంలో ఉత్తమ సేవలందిస్తున్న వైద్యులకు పురస్కారాలను ప్రకటించింది. ఈ వేడుకకు భారత మాజీ క్రికెట్ కపిల్​దేవ్​తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్ రావు.. పలువురు వైద్యులకు పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు-కపిల్ దేవ్​ల మధ్య క్రికెట్​కు సంబంధించి ఆసక్తికర చర్చ జరగడం వైద్యుల్లో నవ్వులు పూయించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.