ETV Bharat / city

Harish rao at Credai conclave: 'సమర్థ నాయకత్వం వల్లే రాష్ట్రంలో స్థిరాస్తి రంగం బలంగా ఎదుగుతోంది' - క్రెడాయ్‌ సమావేశం

ఎంతో మంది సొంతింటి కలల్ని సాకారం చేస్తూ.. రాష్ట్రాభివృద్ధిలో భాగమవుతున్న క్రెడాయ్‌... మరింత ప్రగతి సాధించాలని గవర్నర్‌ తమిళిసై ఆకాంక్షించారు. ప్రభుత్వ విధానాలతో తెలంగాణ స్థిరాస్తి రంగం దేశంలోనే ముందుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన క్రెడాయ్‌ సమావేశంలో గవర్నర్‌, మంత్రి సహా ప్రముఖులు పాల్గొన్నారు.

Harish rao at Credai conclave
Harish rao
author img

By

Published : Dec 24, 2021, 5:42 AM IST

Harish rao at Credai conclave: 'సమర్థ నాయకత్వం వల్లే రాష్ట్రంలో స్థిరాస్తి రంగం బలంగా ఎదుగుతోంది'

హైదరాబాద్‌ హెచ్​ఐసీసీలో క్రెడాయ్‌ రాష్ట్రవ్యాప్త సమావేశం ఘనంగా జరిగింది. 15 జిల్లాలకు చెందిన క్రెడాయ్‌ చాప్టర్ల సభ్యులు 800 మందికిపైగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. నాణ్యత, తక్కువ ధరలో నిర్మాణాల పూర్తి, నూతన సాంకేతికత అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. మూడు దశాబ్దాలుగా నిర్మాణ రంగంలో విశేష సేవలు అందిస్తున్న మైహోం గ్రూపు సంస్థల ఛైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావుకు... గవర్నర్‌ చేతులమీదుగా జీవితకాల సాఫల్య పురస్కారం అందించారు.

చిక్కులకు దూరంగా ఉండాలి..

రాష్ట్రంలో సొంతింటి కళను సాకారం చేయడంలో క్రెడాయ్​ సభ్యుల కృషిని గవర్నర్​ అభినందించారుయ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని, నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకుని, నాణ్యత విషయంలో రాజీపడకుండా సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం నుంచి అన్నిరకాల అనుమతులు వచ్చిన తర్వాతే నిర్మాణాలు చేపట్టి.. న్యాయపరమైన చిక్కులకు దూరంగా ఉండాలని క్రెడాయ్‌ ప్రతినిధులకు గవర్నర్​ దిశానిర్దేశం చేశారు.

సమర్థ నాయకత్వం వల్లే..

సమర్థ నాయకత్వం వల్లే రాష్ట్రంలో స్థిరాస్తి రంగం బలంగా ఎదుగుతోందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. కాన్‌క్లేవ్‌ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ..నిర్దేశించిన ప్రమాణాలను పాటించి నిర్మాణాలు చేసిన వారికి అవార్డులు అందించారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా నిర్మాణాలు చేసి కొనుగోలుదారుల మన్ననలు పొందాలని సూచించారు. హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం దేశంలోనే ముందందన్న మంత్రి.. బ్రాండ్‌ను మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.

ప్రగతిబాటలో..

ఈ తరహా కాన్‌క్లేవ్‌లతో నిర్మాణ రంగంలో వచ్చే మార్పులు, సాంకేతికతపై చర్చించుకుంటూ... ప్రగతిబాటలో పయనించవచ్చని క్రెడాయ్‌ ప్రతినిధులు అన్నారు.

ఇదీచూడండి: Ramineni Foundation Awards: 'తెలుగోడి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.