ETV Bharat / city

హుజూర్​నగర్​లో చెల్లని ఉత్తమ్ మాట.. దుబ్బాకలో చెల్లుతుందా?: హరీశ్

హుజూర్​నగర్​లో చెల్లని ఉత్తమ్ మాట... దుబ్బాకలో చెల్లుతుందా అని మంత్రి హరీశ్​ రావు అన్నారు. దుబ్బాక నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మద్దుల నాగేశ్వర్ రెడ్డిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

minister harish rao fire on congress leaders
హుజూర్​నగర్​లో చెల్లని ఉత్తమ్ మాట.. దుబ్బాకలో చెల్లుతుందా?: హరీశ్
author img

By

Published : Oct 12, 2020, 10:25 PM IST

దుబ్బాకలో కాంగ్రెస్, భాజపాలకు డిపాజిట్ కూడా దక్కదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. తెరాస ఘన విజయం సాధిస్తుందని... హుజూర్​నగర్, నిజమాబాద్ ఫలితాలే పునరావృతమవుతాయన్నారు. హుజూర్​నగర్​లో చెల్లని ఉత్తమ్ మాట... దుబ్బాకలో చెల్లుతుందా అని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ కరెంట్ ఇవ్వక చంపితే... ఇప్పుడు భాజపా మీటర్లు పెట్టి చంపుతానంటోందని విమర్శించారు. దుబ్బాక నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మద్దుల నాగేశ్వర్ రెడ్డిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఫార్మాసిటీ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఎదురు చూస్తుంటే... అడ్డుకుంటానని భట్టి విక్రమార్క అంటున్నారని హరీశ్ విమర్శించారు. రాష్ట్రంలో ఏం చేసినా అడ్డుకోవడం కాంగ్రెస్​కు పరిపాటిగా మారిందని, గతంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసులు వేశారని మండిపడ్డారు. ఇంటింటికీ నీళ్లిస్తామంటే... రుణం ఇవ్వొద్దని హడ్కోకు లేఖ రాశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏం చేద్దామన్నా వద్దంటున్నందుకే... కాంగ్రెస్​ను ప్రజలు వద్దనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో కాంగ్రెస్ ఖాళీ అయిందని, మాణిక్కం ఠాగూర్ వస్తే ఎవరూ లేరన్నారు.

హుజూర్​నగర్​లో చెల్లని ఉత్తమ్ మాట.. దుబ్బాకలో చెల్లుతుందా?: హరీశ్

ఇదీ చూడండి: భారీ మెజార్టీతో కవిత గెలుపు... విపక్షాల డిపాజిట్లు గల్లంతు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.