రాష్ట్రంలో ఉపాధిహామీ అనుసంధాన పనులను ప్రశంసిస్తోన్న కేంద్రం ప్రభుత్వం.. సకాలంలో నిధులు ఇస్తే పల్లెలు మరింతగా అభివృద్ధి చెందుతాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో రాష్ట్రంలోని పల్లెలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయన్నారు. పంచాయతీలకు ప్రతినెలా క్రమం తప్పకుండా నిధులు ఇస్తున్నామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి మెటీరియల్ కాంపొనెంట్ కింద దాదాపు రూ. 800 కోట్ల రావాల్సి ఉందని ఎర్రబెల్లి... ఆ నిధులు వస్తే పల్లెలు మరింతగా అభివృద్ధి జరిగే అవకాశాలుంటాయన్నారు. కేంద్రం నిధులు అందనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్లను అందిస్తున్నామని ఎర్రబెల్లి తెలిపారు. నిధులను సర్దుబాటు చేసేలా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు.