MINISTER BOTSA ON THREE CAPITAL: ఏపీలోని అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నెర చేస్తే చాలు.. ఐదు నిమిషాల్లో పాదయాత్రలు ఆగిపోతాయని.. కానీ ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే నష్టమేంటని మంత్రి బొత్స ప్రశ్నించారు. విశాఖలో రూ.10 వేల కోట్లు పెడితే ముంబయిని తన్నే నగరమవుతుందని వ్యాఖ్యానించారు. కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు అభివృద్ధి జరగాలన్నారు.
ఎన్టీఆర్ రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాక అన్నం తిన్నామని.. ఇది వాస్తవమని తెలిపారు. వైఎస్ జలయజ్ఞంతో తోటపల్లి, వంశధార ప్రాజెక్టులు వచ్చాయని.. ఆ తర్వాత ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గాయని పేర్కొన్నారు. 3 రాజధానులకు అనుకూలంగా సంఘాలన్నీ ర్యాలీ చేయాలని.. ఒక ప్రాంతం, కొందరు వ్యక్తుల కోసం ఆలోచించకూడదని పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: