AP minister Botsa on 3 capital: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో స్పష్టంగా ఉందని.. ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలిసిన ప్రతీసారి ఈ విషయాన్ని ప్రస్తావించామన్నారు.
కట్టుబడి ఉన్నాం
విజయనగరంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి.. ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. పరిపాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. త్వరలోనే విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు అవుతుందని స్పష్టం చేశారు.
వాటిపై చర్చ
జిల్లా కలెక్టరేట్లో మంత్రి బొత్స.. అధికారులతో సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల నుంచి బియ్యం సేకరణ వంటి పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: రాహుల్ గాంధీపై అసోం సీఎం వ్యాఖ్యలను ఖండించిన పీసీసీ.. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు