MINISTER AMBATI: ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలంలో పర్యటించారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీల పారిశుద్ధ్య పనులను పట్టించుకోవడం లేదని ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మఒడి, డ్వాక్రాలకు లంచం అడుగుతున్నారని.. మేము ఎక్కడినుంచి తీసుకురావాలంటూ ఆమె ధ్వజమెత్తారు.
బాధితురాలు చెప్పిన విషయాలను విన్న మంత్రి అంబటి.. అన్నీ వివరాలను కాగితంపై రాసి ఇవ్వాలని కోరారు. ఓ గంటపాటు తాను గ్రామంలోనే పర్యటిస్తానని.. న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: