ETV Bharat / city

"రేపటినుంచి పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు" - tsrtc strike update

ఆర్టీసీ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ హెచ్చరించారు. బస్సుల్లో టికెట్ల ధరల పట్టికలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. డిపోల వద్ద డీఎస్పీ ఇంచార్జిగా కంట్రోల్ రూమ్ నెలకొల్పుతున్నట్లు చెప్పారు. ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ప్రయాణికులు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. అన్ని రకాల బస్ పాసులను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. రేపటి నుంచి అన్ని డిపోల నుంచి షెడ్యూలు ప్రకారం బస్సులు నడుస్తాయని చెప్పారు.

'రేపటి నుంచి అన్ని డిపోల్లో బస్సులు నడవాల్సిందే'
author img

By

Published : Oct 9, 2019, 9:06 PM IST

Updated : Oct 9, 2019, 9:28 PM IST

"రేపటినుంచి పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు"

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం రవాణా వ్యవస్థకు పకడ్బందీ చర్యలు తీసుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ వెల్లడించారు. ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వాహనాలను నడుపుతున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం సరిపడా బస్సులు తిరుగుతున్నాయని, ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. టికెట్‌ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. కార్మికుల సమ్మె, రవాణా శాఖ తీసుకున్న చర్యలు, పండుగకు వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ అజయ్‌, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ బుధవారం అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులు, ఈడీలు, రీజనల్‌, డివిజనల్‌ మేనేజర్లు, ఆర్టీఓలతో సుమారు నాలుగు గంటలపాటు దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు.

ఆర్టీసీ బస్సుల్లో పాసులు నడుస్తాయి...

ప్రతి డిపోలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి పోలీస్‌ శాఖ నుంచి డీఎస్పీ స్థాయి అధికారిని ఇంఛార్జిగా నియమిస్తున్నట్లు చెప్పారు. బస్సుల్లో డ్రైవర్‌ సీటు వెనకాల ధరల పట్టిక కింద ఆయా కంట్రోల్‌ రూంల నెంబర్లను కూడా ప్రదర్శిస్తామని, టికెట్‌ ధర కంటే ఎక్కువ ఛార్జీ తీసుకుంటే ఆ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి పువ్వాడ వివరించారు. అదేవిధంగా ఈ నెల 14 నుంచి విద్యా సంస్థలు కూడా ప్రారంభం కానుండటం వల్ల షెడ్యూల్‌ ప్రకారం బస్సులను నడుపుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముందు ఎలాంటి టూర్‌ షెడ్యూల్‌ ఉండేదో అదే షెడ్యూల్‌ను దాదాపు శుక్రవారం నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి వెళ్లాల్సిన బస్సులను నడుపుతామని తెలిపారు. ఇక ఆర్టీసీ బస్సులన్నింటా బస్‌పాస్‌లను యథావిధిగా అనుమతించాలని ఆదేశించారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు

నాలుగు రోజులుగా ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులతోపాటు వివిధ వాహనాలను తిప్పి, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామని, ఇదే రీతిన తిరుగు ప్రయాణానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రత్యేక సర్వీసుల సేవలన్నీ వినియోగించుకుంటున్నట్లు మంత్రి అజయ్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ దిశా నిర్ధేశంతో ఆయా శాఖల అధికారులు సంయుక్తంగా ప్రజా రవాణా స్థితిగతులు పరిశీలిస్తూ ఏర్పాట్లు చేస్తున్నాని తెలిపారు. ఈ రెండు రోజులు ప్రయాణికుల రద్దీని బట్టీ వాహనాలను తిప్పుతామని చెప్పారు. రైల్వే అధికారులు కూడా ప్రత్యేకంగా మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకలను పెంచారని, అన్ని శాఖల సహకారంతో సమ్మె ప్రభావం లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి పువ్వాడ వివరించారు.

ఇవీ చూడండి: "మరో సకల జనుల సమ్మెకు సమయం ఆసన్నమైంది"

Last Updated : Oct 9, 2019, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.