గ్రేటర్ వరంగల్
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాంపూర్ దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో కౌంటింగ్ చేపడుతున్నారు. వరంగల్‌లో 66 డివిజన్లను 3 బ్లాకులుగా చేసి లెక్కిస్తున్నారు. ఏ బ్లాకులో 32, బీలో 21, సీలో 13 డివిజన్లు ఉన్నాయి. మొత్తం 132 టేబుళ్లలో కౌంటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది.
ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎస్సార్ అండ్ బీజీఎన్నార్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 60 డివిజన్లకు గాను 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. 10వ డివిజన్ అధికార తెరాసకు ఏకగ్రీవం అయింది. 10 కౌంటింగ్ హాళ్లలో ఓట్లు లెక్కిస్తున్నారు. ఒక్కో లెక్కింపు హాల్‌లో 6 డివిజన్ల ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు.
సిద్దిపేట
సిద్దిపేట పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ చేపడుతున్నారు. 22 కౌంటింగ్ టేబుళ్లలో ఓట్లు లెక్కిస్తున్నారు. రెండు రౌండ్లలోనే లెక్కింపు పూర్తికానుంది. మొదటి రౌండ్‌లో 1 నుంచి 21 వార్డులు, రెండో రౌండ్‌లో 22 నుంచి 43 వార్డుల ఓట్లు లెక్కిస్తున్నారు.
నకిరేకల్
నకిరేకల్ పురపాలిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 20 వార్డులకు ఓట్లు లెక్కిస్తున్నారు. తొలి రౌండ్‌లో 12, రెండో రౌండ్‌లో 8 వార్డుల లెక్కింపు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
జడ్చర్ల, అచ్చంపేట
జడ్చర్ల, అచ్చంపేట పురపాలికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జడ్చర్ల డిగ్రీ కళాశాల, అచ్చంపేట జేఎంజే ఉన్నత పాఠశాలలో లో కౌంటింగ్ జరుగుతోంది. జడ్చర్ల పురపాలికలో 27 వార్డులు, అచ్చంపేట పురపాలికలో 20 వార్డులకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట లోపు జడ్చర్ల, అచ్చంపేట ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
కొత్తూరు
రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 12 వార్డులకు లెక్కింపు జరుగుతోంది. కొత్తూరు కె.జి.బి.వి.లో కౌంటింగ్ జరుగుతోంది.